నా మాటలు వక్రీకరించి శునకానందం పొందుతున్నారు : మంత్రి హరీష్ ఫైర్

దిశ, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మింగుడుపడని కొందరు తన మాటలను వక్రీకరించి శునకానందం పొందుతున్నారని మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ట్విట్టర్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో మంగళవారం తాను మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించడం విపక్షాలకే చెల్లిందన్నారు. ఏడేళ్లలో సీఎం కేసీఆర్ వ్యవసాయరంగంలో తీసుకున్న చర్యలతో తెలంగాణ నెంబర్ వన్‌గా మారిందని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో లక్షా 40 వేల మెట్రిక్ […]

Update: 2021-12-01 01:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మింగుడుపడని కొందరు తన మాటలను వక్రీకరించి శునకానందం పొందుతున్నారని మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ట్విట్టర్ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో మంగళవారం తాను మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించడం విపక్షాలకే చెల్లిందన్నారు. ఏడేళ్లలో సీఎం కేసీఆర్ వ్యవసాయరంగంలో తీసుకున్న చర్యలతో తెలంగాణ నెంబర్ వన్‌గా మారిందని వెల్లడించారు.

సంగారెడ్డి జిల్లాలో లక్షా 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని, ఇప్పటికే లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇందుకు గాను కోటి పది లక్షల రూపాయలను రైతులకు చెల్లించామని వెల్లడించారు. ఇప్పటికే 70 శాతం కొనుగోళ్లను పూర్తి చేశామని, మరో 30 శాతం కొనుగోలును చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 157 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. పంట కొనుగోలు పూర్తైన దగ్గర కేంద్రాలను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వ్యవసాయ రంగం, రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని చూసి తట్టుకోలేక తన వ్యాఖ్యలను వక్రీకరించడం సమంజసం కాదన్నారు.

Tags:    

Similar News