దేశంలోని ఏ రాష్ట్రంలో… ఇలా జరగడం లేదు
దిశ, ఆందోల్: కరోనా మహమ్మారి మూలంగా రాష్ట్ర ఆదాయం తగ్గినా… ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఆపలేదని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. శుక్రవారం ఆందోళ్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. రూ.2 కోట్లతో నిర్మించనున్న ఆందోల్ – జోగిపేట టౌన్ హాల్ పనులకు ఆయన జెడ్పీ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ […]
దిశ, ఆందోల్: కరోనా మహమ్మారి మూలంగా రాష్ట్ర ఆదాయం తగ్గినా… ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఆపలేదని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. శుక్రవారం ఆందోళ్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. రూ.2 కోట్లతో నిర్మించనున్న ఆందోల్ – జోగిపేట టౌన్ హాల్ పనులకు ఆయన జెడ్పీ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్‌లను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కుల, మత బేధాలు లేకుండా నిరుపేదలైన ఆడ పిల్లల వివాహానికి రూ.లక్ష నూటపదహార్ల ఆర్థికసాయం అందజేస్తోందని తెలిపారు. దేశంలో మరే రాష్ట్రం ఇలాంటి పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయన్నారు. కరోనాతో ఆదాయం తగ్గినా… ఈ ఒక్క నెలలోనే కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ. 401 కోట్లు చెల్లించామన్నారు.
ఇటీవలే రైతు బంధు కింద రూ. 7400 కోట్లు సాయం అందించామన్నారు. ఆసరా పెన్షన్లు సైతం అందిస్తున్నామన్నారు. ఆందోల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి టౌన్ హాలును అన్ని హంగులతో నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఆందోల్‌లో 320 డబుల్ బెడ్ రూంల నిర్మాణం పూర్తయిందన్నారు. అర్హులైన నిరు పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావును మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.