వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది : హరీశ్ రావు
దిశ, గజ్వేల్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందనీ, చేతి నిండా పేదలకు పని దొరికిందనీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ మహతి ఆడిటోరియంలో 411 మందికి రూ.4 కోట్ల 10 లక్షల కళ్యాణ లక్ష్మి చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇప్పటివరకూ గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపుగా రూ.46 కోట్ల కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో పెళ్లిళ్లకు ప్రభుత్వం […]
దిశ, గజ్వేల్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందనీ, చేతి నిండా పేదలకు పని దొరికిందనీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ మహతి ఆడిటోరియంలో 411 మందికి రూ.4 కోట్ల 10 లక్షల కళ్యాణ లక్ష్మి చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇప్పటివరకూ గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపుగా రూ.46 కోట్ల కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశామని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో పెళ్లిళ్లకు ప్రభుత్వం సాయం చేయడం లేదని, తెలంగాణలో మాత్రమే సీఎం కేసీఆర్ కృషి వల్ల అది సాధ్యం అయిందని అన్నారు. అంతకుముందు ముట్రాజ్‌పల్లి ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ… కరోనా సంక్షోభ సమయంలో కూడా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. స్వరాష్ట్రంలో ప్రజలకు చేతినిండా పని ఉందని తెలిపారు. ఎస్సీల విద్యాభివృద్ధికి గజ్వేల్‌లోని ప్రతి మండలానికి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు. విదేశాలలో విద్యనభ్యసించే ఎస్సీ విద్యార్థులకు రూ.15లక్షల ఆర్థికసాయం అందిస్తామన్నారు.