ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తా : ఈటల
దిశ, వెబ్‌డెస్క్ : నాపై వచ్చిన ఆరోపణలు నిజమైతే రాజకీయ సన్యాసం చేస్తానని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. నాకు ఆత్మ గౌరవం కంటే పదవి గొప్ప కాదన్నారు. రాజకీయ కక్షతోనే ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పూనుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నేను ఏ ఒక్కరి దగ్గర నుంచి ఎకరం భూమి కూడా లాక్కోలేదని, తన ఆస్తులు, చరిత్రపై సీఎస్, విజిలెన్స్, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకోవచ్చని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై […]
దిశ, వెబ్‌డెస్క్ : నాపై వచ్చిన ఆరోపణలు నిజమైతే రాజకీయ సన్యాసం చేస్తానని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. నాకు ఆత్మ గౌరవం కంటే పదవి గొప్ప కాదన్నారు. రాజకీయ కక్షతోనే ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పూనుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నేను ఏ ఒక్కరి దగ్గర నుంచి ఎకరం భూమి కూడా లాక్కోలేదని, తన ఆస్తులు, చరిత్రపై సీఎస్, విజిలెన్స్, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకోవచ్చని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై ఆయన మీడియా ముఖంగా స్పందించారు. తనపై ముందస్తు ప్రణాళికతో కట్టుకథలు అల్లి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పెయిడ్ ఆర్టికల్స్, తప్పుడు వార్తలు రాస్తే జనం పాతర వేస్తారని హెచ్చరించారు.
ఈటల రాజేందర్ సమస్యలపై పోరాడుతాడు తప్ప లొంగిపోడని చెప్పారు. అక్రమంగా తన దగ్గర ఒక్క ఎకరం భూమి ఉన్నా షెడ్లు కూలగొట్టి తీసుకోవచ్చని చెప్పారు. నా చరిత్ర ఏంటో తెలుసుకోవాలన్నారు. భూమిని కోల్పోయిన పర్వాలేదు కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోనన్నారు. తనపై నయీం రెక్కీ నిర్వహించినా బెదరలేదన్నారు. పౌల్ట్రీకి ఎక్కువ భూమి అవసరం ఉంటుందని, దానికోసం పరిశ్రమల శాఖకు, సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని చెప్పారు. పౌల్ట్రీ కోసం కెనరా బ్యాంక్ వద్ద రూ.100 కోట్లు రుణం తీసుకున్నాం అన్నారు. రైతులు వద్ద ఉన్నది వ్యవసాయ భూమి కాదు. ఒక్క ఎకరం కూడా నా స్వాధీనంలో లేదు. రైతులు స్వచ్ఛందంగా సరెండర్ చేశారు. ఆ భూమిని పరిశ్రమల శాఖ నుంచి ఇవ్వొచ్చని చెప్పారు.