చైనా నుంచి పరిశ్రమలు తెలంగాణకు: ఎర్రబెల్లి
దిశ, వరంగల్: మరో ఏడాది కాలంలో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు రానుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కరోనా కారణంగా చైనాలో పరిశ్రమలు తరలిపోతున్నాయని, అవి మన తెలంగాణకే రాబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నట్లు ఎర్రబెల్లి పేర్కొన్నారు. తెలంగాణకు వచ్చే పరిశ్రమలో ఎక్కవ శాతం వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శనివారం మంత్రి ఎర్రబెల్లి నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. […]
దిశ, వరంగల్: మరో ఏడాది కాలంలో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు రానుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కరోనా కారణంగా చైనాలో పరిశ్రమలు తరలిపోతున్నాయని, అవి మన తెలంగాణకే రాబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నట్లు ఎర్రబెల్లి పేర్కొన్నారు. తెలంగాణకు వచ్చే పరిశ్రమలో ఎక్కవ శాతం వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శనివారం మంత్రి ఎర్రబెల్లి నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మరో ఏడాది పాటు కరోనా కష్టాలు ప్రపంచం మొత్తానికి ఉంటాయన్నారు. దీంతో చైనాలోని పరిశ్రమలు భారత్‌కు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాకు దేవాదుల, ఎస్సారెస్పీ, కాళేశ్వరం జలాలు రావడంతో రైతాంగం బాగుపడుతోందన్నారు. ఇక పరిశ్రమలు కూడా వస్తే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.