ఏపీలో 38 ఎల్పీజీ దహన వాటికల ఏర్పాటు

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీలో నూతనంగా రూ.51.48 కోట్లతో 38 ఎల్పీజీ దహన వాటికలను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇటీవల కాలంలో మృతదేహాల అంతిమయాత్రల నిర్వహణలో కొన్ని అమానవీయ సంఘటనలు చోటుచోసుకున్నాయని, ఇటువంటి సంఘటనలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి శ్మశాన వాటికలు నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. 37 దహనవాటికల ఏర్పాటుకు రూ.15.92 కోట్లు, 35 శ్మశానాల్లో వసతుల కల్పనకు రూ.35.56 కోట్లను ఖర్చు చేస్తున్నామని […]

Update: 2020-07-29 04:47 GMT

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీలో నూతనంగా రూ.51.48 కోట్లతో 38 ఎల్పీజీ దహన వాటికలను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇటీవల కాలంలో మృతదేహాల అంతిమయాత్రల నిర్వహణలో కొన్ని అమానవీయ సంఘటనలు చోటుచోసుకున్నాయని, ఇటువంటి సంఘటనలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి శ్మశాన వాటికలు నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. 37 దహనవాటికల ఏర్పాటుకు రూ.15.92 కోట్లు, 35 శ్మశానాల్లో వసతుల కల్పనకు రూ.35.56 కోట్లను ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శ్మశాన వాటికలు ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక ఒకటి ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ పనులకు సంబంధించిన టెండరింగ్ ప్రక్రియను పూర్తి చేసి, వచ్చే నవంబరు నెలాఖరు కల్లా అందుబాటులోకి తెస్తామని అన్నారు.

పట్టణ ప్రాంతాల్లో మరణించిన వారి అంతిమ సంస్కారాల నిర్వహణకు సరైన సదుపాయాలు లేవని గుర్తించామని, పర్యావరణ హితంగా, ఎల్పీజీతో నిర్వహించేలా దహన వాటికల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News