లోకేష్ పై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి బొత్స

దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రాధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్‌కు రాజకీయాలపై అవగాహన లేదని..అందువల్లే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..బీసీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, టిడ్కో ఇళ్ల గురించి లోకేశ్‌కు ఏం తెలుసునని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీల స్థితిగతులను మార్చేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోందని చెప్పారు. ఈ సందర్భంగా మూడు […]

Update: 2021-08-24 09:24 GMT

దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రాధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్‌కు రాజకీయాలపై అవగాహన లేదని..అందువల్లే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..బీసీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, టిడ్కో ఇళ్ల గురించి లోకేశ్‌కు ఏం తెలుసునని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీల స్థితిగతులను మార్చేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోందని చెప్పారు.

ఈ సందర్భంగా మూడు రాజధానులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స మరోసారి తెగేసి చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నా.. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నా..మూడు రాజధానులు తప్పనిసరని అభిప్రాయపడ్డారు. అమరావతి పిటిషన్లపై రోజువారీ విచారణ అని ప్రకటించినప్పుడే పిటిషనర్లే వాయిదా అడగాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. టిడ్కో ఇళ్ల కేటాయింపులు, జగనన్న కాలనీల నిర్మాణాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారని పనులు వేగవంతం చేసి లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Tags:    

Similar News