నిమ్మగడ్డకు మొండితనం పనికిరాదు : మంత్రి బొత్స
దిశ, ఏపీబ్యూరో : ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు అంత మొండితనం పనికిరాదని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగబద్దంగా ప్రజలతో ఎన్నికోబడిన ప్రభుత్వం అభిప్రాయాలను ఎస్‌ఈసీ గౌరవించకపోవడం సరికాదని చెప్పారు. రాష్ర్టంలో ప్రస్తుతం కోవిడ్వ్యాక్సినేషన్కన్నా ముఖ్యమైన మరో కార్యక్రమం ఏదీ లేదన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ విధుల్లో పాల్గొంటున్నారు. వాళ్లపై బలవంతంగా ఎన్నికల విధులు రుద్దడం […]
దిశ, ఏపీబ్యూరో : ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు అంత మొండితనం పనికిరాదని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగబద్దంగా ప్రజలతో ఎన్నికోబడిన ప్రభుత్వం అభిప్రాయాలను ఎస్‌ఈసీ గౌరవించకపోవడం సరికాదని చెప్పారు. రాష్ర్టంలో ప్రస్తుతం కోవిడ్వ్యాక్సినేషన్కన్నా ముఖ్యమైన మరో కార్యక్రమం ఏదీ లేదన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ విధుల్లో పాల్గొంటున్నారు. వాళ్లపై బలవంతంగా ఎన్నికల విధులు రుద్దడం సబబు కాదన్నారు. ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ మొండిగా వ్యవహరిస్తే ఎలా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవడం తగదని సూచించారు.