‘వాటి నిర్మాణం దేశానికే తలమానికం’
దిశ, ఖమ్మం: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలఅన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేధికలు నిర్మాణాలు చేపట్టారని, ఇది దేశానికే తలమానికంగా నిలువనుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు వేధిక నిర్మాణ పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో నిర్మించిన వైకుంఠధామంను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి […]
దిశ, ఖమ్మం: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలఅన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేధికలు నిర్మాణాలు చేపట్టారని, ఇది దేశానికే తలమానికంగా నిలువనుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు వేధిక నిర్మాణ పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో నిర్మించిన వైకుంఠధామంను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ… రైతులకు మేలైన పంటలు వేసుకుని లాభపడాలన్నదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అన్నారు. వ్యవసాయ విజ్ఞానం పెంపొందించేందుకే రైతు వేధికలు నిర్మాణాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. క్లస్టర్ పరిధిలోని రైతాంగాన్ని ఒకే వేధిక మీదకు చేర్చేందుకు రైతులు పంటల కాలంలో తగు సలహాలు సూచనలు తీసుకునేందుకు వేధికలు నెలకొల్పామన్నారు. తద్వారా రైతాంగాన్ని సంఘటితం చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. గిట్టుబాటు ధర నిర్ణయించేందుకు రైతు వేధికలు తొలి అడుగు వేశారని, ఏ ఏ పంటలకు ఏ ఏ భూములు అనువైనవో రైతులలో అవగాహన పెంపొందించేందుకు, భూసారం, పోషకాల చర్చకు రైతు వేదికలు ఎంతగానో దోహదపడతాయన్నారు.