బంగారు తెలంగాణే లక్ష్యం : మంత్రి పువ్వాడ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా పరిధిలోని రఘునాధ్ పాలెం మండలం వీవీపాలెం గ్రామంలో రూ.2కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సెంట్రల్ లైటింగ్, రోడ్ విస్తరణపనులకు, రఘునాధ పాలెం మండలంలోని మంచుకొండ గ్రామంలో రూ.2కోట్లతో నూతనంగా నిర్మించనున్న రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా పరిధిలోని రఘునాధ్ పాలెం మండలం వీవీపాలెం గ్రామంలో రూ.2కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సెంట్రల్ లైటింగ్, రోడ్ విస్తరణపనులకు, రఘునాధ పాలెం మండలంలోని మంచుకొండ గ్రామంలో రూ.2కోట్లతో నూతనంగా నిర్మించనున్న రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో అనేక పథకాలను ప్రవేశ పెట్టినట్టు తెలిపారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు.