కనీస వేతన చట్టం అమలు చేయాలి: సీఐటీయూ

దిశ, ములకలపల్లి: కనీస వేతనం చట్టం అమలు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి మెమోరాండం అందచేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు మాట్లాడారు. రాష్ట్రంలో 73 వ షెడ్యూల్ ప్రాంత పరిశ్రమలలో సుమారు ఒక కోటి ఇరవై లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారని, వీరిలో ప్రభుత్వరంగ కాంట్రాక్ట్ కార్మికులు, ప్లాంటేషన్ వర్కర్స్, పెట్రోల్ బంక్ వర్కర్స్, సినిమా హాలు […]

Update: 2021-10-08 06:01 GMT

దిశ, ములకలపల్లి: కనీస వేతనం చట్టం అమలు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి మెమోరాండం అందచేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు మాట్లాడారు. రాష్ట్రంలో 73 వ షెడ్యూల్ ప్రాంత పరిశ్రమలలో సుమారు ఒక కోటి ఇరవై లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారని, వీరిలో ప్రభుత్వరంగ కాంట్రాక్ట్ కార్మికులు, ప్లాంటేషన్ వర్కర్స్, పెట్రోల్ బంక్ వర్కర్స్, సినిమా హాలు వర్కర్స్, పంచాయతీ సిబ్బంది, ఫార్మా పరిశ్రమ గ్రామ పంచాయతీ సిబ్బంది, నర్సరీ సిబ్బంది ఈ పరిశ్రమ కింద ఉన్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాలు అయినా 2014 -2016 కనీస వేతన సలహా మండలిని తెలంగాణ ప్రభుత్వం బుట్ట దాఖలు చేసిందని, దీనివల్ల షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు లక్ష రూపాయల వేతనాలు కోల్పోయారన్నారు. కార్యక్రమంలో ములకలపల్లి మండల కార్మికులు, సిబ్బంది వన సేవకులు అబ్బులు, పెంటమ్మ, ఇందిరా, పెట్రోల్ బంక్ సిబ్బంది రాజి శ్రీను, గ్రామ పంచాయతీ సిబ్బంది సాయి రత్న, సిహెచ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..