సొంతూర్ల పైసలు పోగైత లేవని వస్తే.. ఈడ కష్టాలు మోపైనై !

దిశ, న్యూస్‌బ్యూరో: పొట్టకూటి కోసం పొరుగురాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లలేక, ప్రస్తుతం ఉన్నదగ్గర వసతుల్లేక అవస్థలు పడుతున్నారు. ఇదే క్రమంలో కాలినడకన ఇంటికి పోయేందుకు సిద్ధంగా ఉన్నా యజమాని వద్ద తీసుకున్న డబ్బు చెల్లించనిదే వెళ్లే పరిస్థితులు లేక పోవడంతో కూలీల బతుకులు కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యాయి. యాజమాన్యాలు సైతం కూలీల పట్ల ఏం పట్టనట్లుగా ఉండడంతో షెల్టర్ల వద్ద బాధలు అనుభవిస్తున్న వారి పరిస్థితులు […]

Update: 2020-04-28 07:17 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: పొట్టకూటి కోసం పొరుగురాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లలేక, ప్రస్తుతం ఉన్నదగ్గర వసతుల్లేక అవస్థలు పడుతున్నారు. ఇదే క్రమంలో కాలినడకన ఇంటికి పోయేందుకు సిద్ధంగా ఉన్నా యజమాని వద్ద తీసుకున్న డబ్బు చెల్లించనిదే వెళ్లే పరిస్థితులు లేక పోవడంతో కూలీల బతుకులు కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యాయి. యాజమాన్యాలు సైతం కూలీల పట్ల ఏం పట్టనట్లుగా ఉండడంతో షెల్టర్ల వద్ద బాధలు అనుభవిస్తున్న వారి పరిస్థితులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. కార్మికుల బాగోగులు చూసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా యజమానులు స్పందించకపోవడంతో మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఏపీ నుంచి వచ్చిన దాదాపు 6లక్షల మంది కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ వలస కార్మికులు భవన నిర్మాణాలు, హామాలీ వర్కర్స్‌గా పనిచేస్తుండగా… లాక్‌డౌన్ ఎటూ వెళ్లలేక పరిశ్రమల షెల్టర్లలో ఇరుకు గదుల్లోనే మగ్గిపోతున్నారు.

అయితే.. కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో దేశప్రజలంతా సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ కార్మికులు ప్రస్తుతం ఉంటున్న షెల్టర్ల వద్ద సరైన వసతులు లేక చిన్న రూముల్లోనే, సోషల్ డిస్టెన్స్ పాటించలేని స్థితిలో తలదాచుకుంటున్నారు. రాష్ట్రంలో పేరుమోసిన ఓ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌లో పలురాష్ట్రాలకు చెందిన 350 మంది కార్మికులు షెల్టర్లలో నివాసం ఉంటుండగా కనీసం వ్యక్తిగత శుభ్రతను పాటిద్దామన్న వసతులు లేవు. 350 మందికి 15బాత్‌ రూములు ఉన్నాయంటే అక్కడ ఏవిధంగా పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు వంతుల వారిగా స్నానాలు చేస్తూ టార్చర్ అనుభవిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్క కార్మికుడైనా అనారోగ్యం బారిన పడితే.. వైద్య సౌకర్యాలు అందించేలా కూడా సౌలతి లేదు.

ప్రభుత్వం బియ్యం అందలేదు- రవి, ఒడిశా

సొంత ఊరిలో పనిచేస్తే పైసలు పోగైత లేవని మూడేండ్ల నుంచి ఇక్కడే పనిచేస్తున్న. లాక్‌డౌన్‌తో పనులు లేవు. ఇంటికి డబ్బులు పంపించలేదు. నేను ఇక్కడ ఉన్నా, నా భార్య, బిడ్డలు ఒడిశాలో ఉన్నారు. పోదామంటే పోనిచ్చే పరిస్థితి లేదు. బతుకు దెరువు కోసం వస్తే బతుకే అరిపోయేట్టు తయారైంది. నెలరోజులుగా పనులు లేక చేతిలో పైసలన్నీ అయిపోయినవి. తిండి గింజలు లేవు. ప్రభుత్వం కార్మికులకు ఇస్తానన్న బియ్యం ఇవ్వలేదు. రూ.500 కూడా అందలేదు. రోజుకో పూట తిని మరో పూట పస్తులు ఉంటున్నా.

నా బిడ్డ గోస చూడలేక పోతున్న: సావిత్రి, ఛత్తీస్‌గఢ్


6 నెలలు కూడా లేని నా బిడ్డకు కడుపు నిండ పాలు ఇవ్వలేక పోతున్నా. నేను కడుపు నిండ తింటేగాని నా బిడ్డ కడుపు నింపలేను. నెలరోజుల నుంచి పనుల్లేక కడుపు నిండ తిండే కరువైంది. బిడ్డకు పాలు కొనిపెడదామన్న చేతిల చిల్లిగవ్వ లేదు. నా బిడ్డ గోస చూడలేక పోతున్న

Tags:    

Similar News