లాక్‌డౌన్ భయంతో స్వస్థలాలకు వలస కార్మికులు..
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో మళ్లీ లక్షలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు లాంటి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. అయితే ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కట్టడి కోసం కేజ్రీవాల్ సర్కార్ తగు చర్యలు తీసుకుంటోంది. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా గతేడాది లాగే ఇప్పుడు కూడా లాక్‌డౌన్ విధిస్తారేమో అనే ఊహాగానాల […]
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో మళ్లీ లక్షలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు లాంటి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. అయితే ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కట్టడి కోసం కేజ్రీవాల్ సర్కార్ తగు చర్యలు తీసుకుంటోంది.
కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా గతేడాది లాగే ఇప్పుడు కూడా లాక్‌డౌన్ విధిస్తారేమో అనే ఊహాగానాల నేపథ్యంలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు పయణమవుతున్నారు. ఢిల్లీలోని ఐఎస్‌బీటీ, ఆనంద్ విహార్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వలసకార్మికులు వారి స్వగ్రామాలకు వెళుతున్నారు.