యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో వలస కూలీల ఆందోళన
దిశ, నల్లగొండ: దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం వద్దనున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న వలస కూలీలు సోమవారం ఆందోళనకు దిగారు. దాదాపు 2వేల మంది వలస కూలీలు ఈ ప్లాంట్‌లో పని చేస్తున్నారు. గత కొద్దినెలలుగా కూలీలకు వేతనాలు ఇవ్వకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. లాక్‌డౌన్ నేపథ్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రం పనులు నిలిపివేశారనీ, దీంతో దాదాపు 40 రోజులుగా పనుల్లేక ఇక్కడే ఉండిపోయామని కూలీలు వాపోతున్నారు. తాము చేసిన పనికి డబ్బులు చెల్లించి స్వస్థలాలకు […]
దిశ, నల్లగొండ: దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం వద్దనున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న వలస కూలీలు సోమవారం ఆందోళనకు దిగారు. దాదాపు 2వేల మంది వలస కూలీలు ఈ ప్లాంట్‌లో పని చేస్తున్నారు. గత కొద్దినెలలుగా కూలీలకు వేతనాలు ఇవ్వకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. లాక్‌డౌన్ నేపథ్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రం పనులు నిలిపివేశారనీ, దీంతో దాదాపు 40 రోజులుగా పనుల్లేక ఇక్కడే ఉండిపోయామని కూలీలు వాపోతున్నారు. తాము చేసిన పనికి డబ్బులు చెల్లించి స్వస్థలాలకు పంపించాలని వేడుకుంటున్నారు. వీరంతా ఒరిస్సా, పంజాబ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌కు చెందినవారు. గత 12 రోజులుగా నిత్యావసర సరుకుల కోసం అధికారుల చుట్టూ తిరిగారు. అయితే, ఎవరూ పట్టించుకోకపోవడంతో సోమవారం ప్రాజెక్టు ఎస్‌ఈ కార్యాలయం వద్దకు పెద్దఎత్తున చేరుకొని ఆందోళనకు దిగారు.
tag: migrant workers, yadadri thermal power plant, protest, nalgonda