వలస కూలీల ఆందోళన.. పోలీసుల లాఠీ‌ఛార్జ్

దిశ, కరీంనగర్: తమను సొంత రాష్ట్రాలకు పంపాలని డిమాండ్ చేస్తూ పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలోని వలస కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితి అదుపలోకి తచ్చేందుకు యత్నించారు. ఫలితం లేకపోవడంతో ఆందోళన చేస్తున్న కూలీలపై లాఠీ ఛార్జ్ చేశారు. కాగా, పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ, ఎరువుల కర్మాగారం నిర్మాణంలో ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు ఐదువేల మంది వలస కార్మికులు పని చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా వీరికి 40 […]

Update: 2020-05-03 03:38 GMT

దిశ, కరీంనగర్: తమను సొంత రాష్ట్రాలకు పంపాలని డిమాండ్ చేస్తూ పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలోని వలస కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితి అదుపలోకి తచ్చేందుకు యత్నించారు. ఫలితం లేకపోవడంతో ఆందోళన చేస్తున్న కూలీలపై లాఠీ ఛార్జ్ చేశారు. కాగా, పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ, ఎరువుల కర్మాగారం నిర్మాణంలో ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు ఐదువేల మంది వలస కార్మికులు పని చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా వీరికి 40 రోజులుగా ఉపాధి లేకుండా పోయింది. ఈ క్రమంలో తమ తమ రాష్ట్రాలకు పంపించాలని రెండ్రోజులుగా స్థానిక పోలీస్ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి స్పందనా లేకపోవటంతో ఆదివారం పోలీస్ స్టేషన్ ముందున్న ఎఫ్‌సీఐ క్రాస్ రోడుపై బైఠాయించి ఆందోళన చేశారు. స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా, వినకపోవటంతో పోలీసులు లాఠీ‌ఛార్జీ చేశారు. ఎమ్మెల్యే చందర్, కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం రెండ్రోజుల్లో కూలీల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Tags:    

Similar News