2022-23 నాటికి రూ. 100 కోట్ల ఆదాయం లక్ష్యంగా 'ప్లే' బ్రాండ్

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు వికాస్ జైన్‌కు చెందిన టెక్ బ్రాండ్ ‘ప్లే’ దేశీయంగా పెరుగుతున్న వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ప్రవేశించాలని భావిస్తోంది. దీనికోసం 2022-23 నాటికి రూ. 100 కోట్ల ఆదాయాన్ని సాధించడమే లక్ష్యంగా ఉన్నట్టు ‘ప్లే’ బ్రాండ్ ఛైర్మన్ వికాస్ జైన్ అన్నారు. వేరబుల్, ఫిట్‌నెస్‌తో సహా ఆరేడు విభాగాల్లో ఉత్పత్తులను ప్రారంభించాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. దీనివల్ల దేశీయంగా రిటైల్ మార్కెట్లో మైక్రోసాఫ్ట్ ఉనికిని మరింత పటిష్ఠం చేస్తుందని […]

Update: 2021-07-25 06:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు వికాస్ జైన్‌కు చెందిన టెక్ బ్రాండ్ ‘ప్లే’ దేశీయంగా పెరుగుతున్న వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ప్రవేశించాలని భావిస్తోంది. దీనికోసం 2022-23 నాటికి రూ. 100 కోట్ల ఆదాయాన్ని సాధించడమే లక్ష్యంగా ఉన్నట్టు ‘ప్లే’ బ్రాండ్ ఛైర్మన్ వికాస్ జైన్ అన్నారు. వేరబుల్, ఫిట్‌నెస్‌తో సహా ఆరేడు విభాగాల్లో ఉత్పత్తులను ప్రారంభించాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. దీనివల్ల దేశీయంగా రిటైల్ మార్కెట్లో మైక్రోసాఫ్ట్ ఉనికిని మరింత పటిష్ఠం చేస్తుందని వికాస్ జైన్ అంచనా వేస్తున్నారు.

వచ్చే ఆర్థిక సమత్సరంలో కంపెనీ కనీసం ఆరు లేదంటే ఏడు వేర్వేరు విభాగాల్లో కొత్త ప్రోడక్టులను తీసుకొస్తుందన్నారు. ‘తాము తీసుకొచ్చే ఉత్పత్తులు ఎక్కువగా సింగిల్ కేటగిరీలో ఉండనున్నాయి. అవి పూర్తిగా హై-ఎండ్ ప్రోడక్ట్స్. పర్సనల్ మానిటరింగ్, కన్జ్యూమర్ హోమ్ ఎలక్ట్రానిక్స్, ఫిట్‌నెట్ వంటి వేర్వేరు విభాగాల్లో ఈ ఉత్పత్తులుంటాయని ఆయన తెలిపారు. ఇంకా, ఆడియో, వేరబుల్, ఛార్జింగ్ పరికరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయని వికాస్ జైన్ పేర్కోన్నారు. ఈ నెల మొదట్లో ప్లే తన పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు, దాని ఉత్పత్తి పోఓర్ట్‌ఫోలియోను విస్తరించే ప్రయత్నల్లో భాగంగా రివర్‌సాంగ్ ఇండియాను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటిచింది. అయితే, దీనికి సంబంధించి మిగిలిన వివరాలు వెల్లడించలేదు. ఫోన్ డెవలపర్ ఐఎంజీ టెక్నాలజీ గ్రూ అనుబంధ సంస్థ అయిన రివర్‌సాంగ్ టెక్నాలజీ కీలకమైన స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తులతో ప్రపంచ బ్రాండ్. ఇది భారత్ సహా 60కి పైగా దేశాల్లో ఉనికిని కలిగి ఉంది.

Tags:    

Similar News