జీఎస్టీపై కీలక నిర్ణయం దిశగా కేంద్రం
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) రేట్లలో 12, 18 శాతంగా ఉన్న పన్ను శ్లాబులను ఒకే శ్లాబు కిందకు ఉంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. మార్చిలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై వివరాలు తెలియజేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4 జీఎస్టీ పన్ను శ్లాబులు ఉన్నాయి. అవి..5 శాతం, 12 శాతం, […]
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) రేట్లలో 12, 18 శాతంగా ఉన్న పన్ను శ్లాబులను ఒకే శ్లాబు కిందకు ఉంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. మార్చిలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై వివరాలు తెలియజేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4 జీఎస్టీ పన్ను శ్లాబులు ఉన్నాయి. అవి..5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం. ఇవి కాకుండా విలువైన లోహాలపై 3 శాతంతో పాటు ఆటోమొబైల్స్, పొగాకు వంటి లగ్జరీ వస్తువులపై ప్రత్యేక సెస్‌ను అమలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో 12 శాతం, 18 శాతం ఉన్న జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు చేసిన కొత్త శ్లాబును ఉంచాలని భావిస్తోంది. ‘12,18 శాతం శ్లాబులను విలీనం చేసి కొత్త శ్లాబ్ ఏర్పడితే, ప్రస్తుతం 12 శాతం శ్లాబులో ఉన్న వస్తువులపై పన్ను భారం పెరుగుతుంది. వ్యాపారాలు, వినియోగదారులు ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే, 18 శాతం స్లాబులోని వస్తువులకు పన్ను భారం తగ్గుతుందని’ సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏదేమైనప్పటికీ, ఇప్పుడున్న పన్ను శ్లాబులను మారిస్తే మూడు శ్లాబులకు పరిమితమవనున్నాయి. కాగా, గతంలో 15వ వేతన కమిషన్ సైతం 12-18 శాతం పన్ను శ్లాబులను కలపాలని సూచించిన సంగతి తెలిసిందే.