రాయల్టీని రద్దు చేయండి.. విద్యుత్ చార్జీలు ఎత్తేయండి
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం గ్రానైట్ స్లాబ్ ఫ్యాకర్టీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి కేటీఆర్‌ను కోరారు. గురువారం లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో గ్రానైట్ పరిశ్రమ ప్రతినిధులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరిగిన అనంతరం సింగరేణి […]
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం గ్రానైట్ స్లాబ్ ఫ్యాకర్టీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి కేటీఆర్‌ను కోరారు. గురువారం లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో గ్రానైట్ పరిశ్రమ ప్రతినిధులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరిగిన అనంతరం సింగరేణి తరువాత, ఆ స్థాయిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్ పరిశ్రమపై విధిస్తున్న మైనింగ్ రాయల్టీని ఏడాది కాలం పాటు రద్దు చేయాలని మంత్రిని కోరారు. అలాగే విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కనీస ఛార్జీలు ఒకేడాది పాటు ఎత్తేయాలని, ప్రభుత్వం నుంచి సబ్సిడీ, పావల వడ్డీ లాంటి ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. ఈ పరిస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్‌ను ఎంపీ నామ కోరారు. స్పందించిన మంత్రి కేటీఆర్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని హామీ ఇచ్చినట్టు తెలిపారు.