కరోనాకు మరో ఎంపీ బలి
అహ్మదాబాద్ : కరోనా మహమ్మారికి మరో ఎంపీ బలయ్యారు. గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ అభయ్ భరద్వాజ్ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఏడాది జూలై నెలలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆగస్టులో కరోనా బారిన పడగా రాజ్‌కోట్‌లోని హాస్పిటల్‌లో చికిత్స అందించారు. తీవ్ర ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న భరద్వాజ్ మంగళవారం […]
అహ్మదాబాద్ : కరోనా మహమ్మారికి మరో ఎంపీ బలయ్యారు. గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ అభయ్ భరద్వాజ్ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఏడాది జూలై నెలలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆగస్టులో కరోనా బారిన పడగా రాజ్‌కోట్‌లోని హాస్పిటల్‌లో చికిత్స అందించారు. తీవ్ర ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.
అప్పటి నుంచి చికిత్స పొందుతున్న భరద్వాజ్ మంగళవారం కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలను విడిచారు. మహమ్మారి కారణంగా మృతిచెందిన గుజరాత్‌కు చెందిన రెండో రాజ్యసభ సభ్యుడు భరద్వాజ్. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ మృతిచెందిన విషయం విదితమే. ఎంపీ అభయ్ భరద్వాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో సంతాపం వ్యక్తం చేశారు.