డొమినికా జైలులో గాయాలతో మెహుల్ చోక్సీ
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)లో ఫ్రాడ్ కేసులో నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ డొమినికా జైలులో ఉన్న ఫొటోలు బయటికి వచ్చాయి. ఆయన ముంజేతికి గాయాలైనట్టుగా ఆ చిత్రాల్లో కనిపించింది. బ్లూ కలర్ టీ షర్టు వేసుకున్న చోక్సీ చేతి గాయాలను చూపుతూ కనిపించారు. పీఎన్‌బీలో ఫ్రాడ్ కేసు వెలుగులోకి బాహాటంగా రాకమునుపే ఆయన దేశం వదిలి అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత కరీబియన్ దేశం ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నట్టు తెలిసింది. అక్కడే పౌరసత్వం తీసుకున్నారు. ఉన్నట్టుండి […]
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)లో ఫ్రాడ్ కేసులో నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ డొమినికా జైలులో ఉన్న ఫొటోలు బయటికి వచ్చాయి. ఆయన ముంజేతికి గాయాలైనట్టుగా ఆ చిత్రాల్లో కనిపించింది. బ్లూ కలర్ టీ షర్టు వేసుకున్న చోక్సీ చేతి గాయాలను చూపుతూ కనిపించారు. పీఎన్‌బీలో ఫ్రాడ్ కేసు వెలుగులోకి బాహాటంగా రాకమునుపే ఆయన దేశం వదిలి అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత కరీబియన్ దేశం ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నట్టు తెలిసింది. అక్కడే పౌరసత్వం తీసుకున్నారు. ఉన్నట్టుండి అక్కడ అదృశ్యమై డొమినికా దేశంలో కనిపించారు. ఆయనను భారత్‌కు అప్పగించాలని ఆంటిగ్వా ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయన తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. తాజాగా, డొమినికా దేశంలోని ఓ జైలులో ఉన్న చోక్సీ చిత్రాలు మీడియాకు అందాయి.