మెగా డాటర్ సీరీస్‌కు బ్రేక్

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సోదరుడు రామ్ చరణ్ బాటలో భర్తతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ స్టార్ట్ చేసిన సుష్మిత.. నిర్మాతగా వెబ్ సీరీస్ ప్లాన్ చేసింది. టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో సాగే ఈ సీరీస్‌కు ఓయ్ సినిమా డైరెక్టర్ ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ జీ5 ప్లాట్ ఫామ్‌పై అలరించేందుకు ముస్తాబు అవుతుంది. అయితే ఇప్పుడు […]

Update: 2020-07-24 05:56 GMT

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సోదరుడు రామ్ చరణ్ బాటలో భర్తతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ స్టార్ట్ చేసిన సుష్మిత.. నిర్మాతగా వెబ్ సీరీస్ ప్లాన్ చేసింది. టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో సాగే ఈ సీరీస్‌కు ఓయ్ సినిమా డైరెక్టర్ ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్నారు.

హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ జీ5 ప్లాట్ ఫామ్‌పై అలరించేందుకు ముస్తాబు అవుతుంది. అయితే ఇప్పుడు షూటింగ్‌కు బ్రేక్ పడినట్లు సమాచారం. యూనిట్ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో చిత్రీకరణ ఆపేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూనిట్ మొత్తం ఐసొలేషన్‌లో ఉండగా.. షూటింగ్ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం ప్రపంచం పరిస్థితే ఇలా ఉండగా.. చేసేదేమీ లేక తగు జాగ్రత్తలతో షూటింగ్‌లు జరుగుతున్నాయి.

Tags:    

Similar News