మేఘా ఇంజనీరింగ్ సంస్థ దాతృత్వం.. ‘ఫ్రీ’గా ఆక్సిజన్ సరఫరా
దిశ, తెలంగాణ బ్యూరో : ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ (ఎంఈఐఎల్) ముందుకొచ్చి తన దాతృత్వాన్ని చాటుకుంది. రోజుకు 500 ఆక్సిజన్ సిలిండర్లు అందించాలని నిమ్స్, అపోలో, సరోజినిదేవి ఆసుపత్రుల నుంచి వినతి పత్రాలు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం డి.ఆర్.డి.వోతో కలిసి 30 నుంచి 40 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. స్పెయిన్ నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ను దిగుమతి చేసి ఒక్కొక్క ప్లాంటు నుంచి నిమిషానికి […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ (ఎంఈఐఎల్) ముందుకొచ్చి తన దాతృత్వాన్ని చాటుకుంది. రోజుకు 500 ఆక్సిజన్ సిలిండర్లు అందించాలని నిమ్స్, అపోలో, సరోజినిదేవి ఆసుపత్రుల నుంచి వినతి పత్రాలు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం డి.ఆర్.డి.వోతో కలిసి 30 నుంచి 40 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.
స్పెయిన్ నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ను దిగుమతి చేసి ఒక్కొక్క ప్లాంటు నుంచి నిమిషానికి 150 నుంచి 1000 లీటర్లు ఉత్పత్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. నిమ్స్ ఆసుపత్రి సిబ్బంది వినతి మేరకు రోజుకు 50 బి.టైప్ మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు (ఒక్కొక్క సిలిండర్ 7000 లీటర్లు) సరఫరా చేయనున్నారు. సరోజిని దేవి ఆసుప్రతికి రోజుకు దాదాపు 200 సిలిండర్లను, అపోలో ఆసుపత్రికి ప్రతిరోజు 100 సిలిండర్లు, కేర్ హైటెక్ కు రోజుకు 50 సిలిండర్లను సరఫరా చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో ఆసుపత్రుల నుంచి వచ్చే విజ్ఞప్తి మేరకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.