516 బాడీ మోడిఫికేషన్లతో రోల్ఫ్ రికార్డు

దిశ, వెబ్‌డెస్క్: విదేశీయుల్లో బాడీ మోడిఫికేషన్స్ మోజు ఎక్కువే. కానీ ఓ వ్యక్తి మాత్రం బాడీలో ఏకంగా 516‌కు పైగా మార్పులు చేసుకుని వరల్డ్‌ రికార్డు సృష్టించడం విశేషం. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన ఏం చేస్తాడు? జర్మనీకి చెందిన రోల్ఫ్ బుచోల్జ్‌ స్థానిక టెలికాం కంపెనీలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం విభాగంలో పని చేస్తున్నాడు. అతడు 40 ఏళ్ళ వయసులో మొట్ట మొదటిసారిగా పచ్చబొట్టుతో తన బాడీ మోడిఫికేషన్‌‌కు శ్రీకారం చుట్టాడు. ఏ శుభముహుర్తాన ఇది […]

Update: 2020-10-26 08:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: విదేశీయుల్లో బాడీ మోడిఫికేషన్స్ మోజు ఎక్కువే. కానీ ఓ వ్యక్తి మాత్రం బాడీలో ఏకంగా 516‌కు పైగా మార్పులు చేసుకుని వరల్డ్‌ రికార్డు సృష్టించడం విశేషం. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన ఏం చేస్తాడు?

జర్మనీకి చెందిన రోల్ఫ్ బుచోల్జ్‌ స్థానిక టెలికాం కంపెనీలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం విభాగంలో పని చేస్తున్నాడు. అతడు 40 ఏళ్ళ వయసులో మొట్ట మొదటిసారిగా పచ్చబొట్టుతో తన బాడీ మోడిఫికేషన్‌‌కు శ్రీకారం చుట్టాడు. ఏ శుభముహుర్తాన ఇది మొదలు పెట్టాడో కానీ.. ఆనాటి నుంచి తను తరచుగా బాడీ మోడిఫికేషన్ చేసుకుంటూనే ఉన్నాడు. పచ్చబొట్లతో పాటు పెదవులపై, కనుబొమ్మలపై తరచూ పియర్సింగ్ చేసుకుంటూ.. పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. మొత్తంగా 516కు పైగా బాడీ మోడిఫికేషన్స్‌‌ చేయించుకున్న వ్యక్తిగా తాజాగా గిన్నిస్‌ రికార్డుకు ఎక్కాడు. కాగా రోల్ఫ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

‘బాడీ మోడిఫికేషన్ వల్ల నా శరీరం బయట మార్పులొచ్చాయి. కానీ నాలో ఎటువంటి మార్పులు రాలేదు. నేను ఇదివరకటిలానే ఉన్నాను’ అని రోల్ఫ్ అంటున్నాడు. 2010లో 453 ఆపరేషన్స్‌, పచ్చబొట్లు, ఇంప్లాంట్లు చేయించుకుని అత్యధిక సంఖ్యలో శరీరంపై కుట్లు వేసుకున్న వ్యక్తిగా గుర్తింపు సాధించాడు.

Tags:    

Similar News