Jeff bezos స్పేస్ రాకెట్ తయారీలో ముంబై అమ్మాయి..

దిశ, ఫీచర్స్ : వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ చేపట్టిన ‘యూనిటీ 22’ స్పేస్ టూర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. న్యూమెక్సికో‌లోని స్పేస్ పోర్ట్ నుంచి వర్జిన్ కంపెనీ అధినేత రిచర్డ్ బ్రాన్సన్, తెలుగు అమ్మాయి శిరీష బండ్లతో సహా ఆరుగురు అంతరిక్షంలోకి వెళ్లి విజయవంతంగా తిరిగి రాగా, ప్రపంచ కుబేరుడు బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ కూడా జూలై 20న అంతరిక్షయానం చేయనున్నాడు. న్యూ షెపర్డ్’ రాకెట్ ద్వారా బెజోస్ సహా ముగ్గురు రోదసిలోకి […]

Update: 2021-07-17 03:22 GMT

దిశ, ఫీచర్స్ : వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ చేపట్టిన ‘యూనిటీ 22’ స్పేస్ టూర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. న్యూమెక్సికో‌లోని స్పేస్ పోర్ట్ నుంచి వర్జిన్ కంపెనీ అధినేత రిచర్డ్ బ్రాన్సన్, తెలుగు అమ్మాయి శిరీష బండ్లతో సహా ఆరుగురు అంతరిక్షంలోకి వెళ్లి విజయవంతంగా తిరిగి రాగా, ప్రపంచ కుబేరుడు బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ కూడా జూలై 20న అంతరిక్షయానం చేయనున్నాడు. న్యూ షెపర్డ్’ రాకెట్ ద్వారా బెజోస్ సహా ముగ్గురు రోదసిలోకి వెళ్లనున్నారు. అయితే స్పేస్‌లోకి వీళ్లను తీసుకెళ్లే ‘న్యూ షెపర్డ్’ రాకెట్ వ్యవస్థను నిర్మించిన బ్లూ ఆరిజిన్ ఇంజనీర్ల బృందంలో ఓ భారతీయ మహిళ కూడా భాగమైంది. ఆ యువతే మహారాష్ట్రలోని కళ్యాణ్‌ ప్రాంతానికి చెందిన సంజాల్ గవాండే.

ఆకాశంలో సగం, అవనిలో సగమని నిరూపిస్తున్నారు మహిళలు. ఇటీవలే శిరీష అంతరిక్ష యానం చేసి కొత్త చరిత్ర సృష్టించగా, తాజాగా ‘న్యూ షెపర్డ్’ రాకెట్ నిర్మాణంలో భాగమైన మహారాష్ట్ర మహిళ సంజాల్ కీలక పాత్ర పోషించి సత్తా చాటింది. కళ్యాణ్ ప్రాంతంలో పుట్టి పెరిగిన సంజాల్ తండ్రి మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగి. ముంబై విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన సంజాల్, ఆపై యూఎస్‌లోని మిచిగాన్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ కంప్లీట్ చేసింది. ఈ కోర్సు సమయంలోనే ఏరోస్పేస్‌ను ఒక అంశంగా చదివిన ఆమె విద్యాభ్యాసం పూర్తికాగానే మెర్యూరీ మెరైన్‌లో ఉద్యోగం పొందింది.

రెండేళ్ల తర్వాత కాలిఫోర్నియాలోని టొయోటా రేసింగ్ డెవలప్‌మెంట్‌.. (రేసింగ్ కార్ కంపెనీ)లో పని చేస్తూ.. ఇందులో ఉండగానే వీకెండ్స్‌లో పైలట్ కోర్సు చేసింది. ఈ క్రమంలోనే 2016లో పైలట్ లైసెన్స్ కూడా పొందిన సంజాల్‌.. చిన్నప్పటి నుంచి అంతరిక్ష రంగంలో పనిచేయాలనే కోరికతోనే ఏరో స్పేస్ సబ్జెక్ట్ నేర్చుకుని, నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. కానీ పౌరసత్వ సమస్యల కారణంగా ఆమెకు ఉద్యోగం రాలేదు. ఇక ఆ తర్వాత జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌‌కు అప్లయ్ చేసిన సంజాల్ ఇంటర్వ్యూను క్లియర్ చేసి అందులో చేరింది.

అంతరిక్ష నౌకను నిర్మించాలనే నా కల ‘న్యూ షెపర్డ్’తో నెరవేరింది. ఈ బృందంలో భాగమైనందుకు గర్వపడుతున్నాను’ అంటూ సంజాల్ తన ఆనందం వ్యక్తం చేసింది.

‘చిన్నప్పటి నుండి, నా కుమార్తె అంతరిక్ష రంగంలో పనిచేయాలనుకుంది. అందుకు అనుగుణంగానే మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. కానీ ఆమె అంత కష్టపడి పనిచేయగలదా? అని మేము ఆలోచించేవాళ్లం. కానీ ఆ భయాలను, అనుమానాలను ఆమె బ్రేక్ చేసింది. తను అనుకున్నట్లుగానే ఈ రోజు రాకెట్ తయారీలో భాగమైంది. కారు ఇంజిన్లను తయారుచేయడం నుంచి రాకెట్ తయారీ వరకు ఆమె ఎదగడం మాకెంతో గర్వంగా ఉంది’

– సురేఖ, సంజాల్ తల్లి

Tags:    

Similar News