అసమర్థపు ప్రభుత్వానికి జీఎస్టీ కూడా చెల్లించాలా?.. హీరోయిన్
దిశ, సినిమా : హీరోయిన్ మీరా చోప్రా కరోనా సమయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూనే ఉంది. మందులు, బెడ్లు, ఆక్సిజన్ కొరతపై సర్కార్‌ను ప్రశ్నిస్తూనే ఉంది. కొవిడ్ కారణంగా కేవలం పది రోజుల వ్యవధిలో ఇద్దరు కజిన్స్‌ను కోల్పోయిన ఆమె గవర్నమెంట్‌పై ఫైర్ అయింది. ప్రజలకు సరైన వైద్యసదుపాయాలు అందించకుండా, వారి ప్రాణాలు పోయేందుకు కారణమవుతున్న ప్రభుత్వానికి జీఎస్టీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించింది. కనీస వైద్యం అందించలేని గవర్నమెంట్ 18 శాతం జీఎస్టీ చెల్లించాలన్న నిబంధనను […]
దిశ, సినిమా : హీరోయిన్ మీరా చోప్రా కరోనా సమయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూనే ఉంది. మందులు, బెడ్లు, ఆక్సిజన్ కొరతపై సర్కార్‌ను ప్రశ్నిస్తూనే ఉంది. కొవిడ్ కారణంగా కేవలం పది రోజుల వ్యవధిలో ఇద్దరు కజిన్స్‌ను కోల్పోయిన ఆమె గవర్నమెంట్‌పై ఫైర్ అయింది. ప్రజలకు సరైన వైద్యసదుపాయాలు అందించకుండా, వారి ప్రాణాలు పోయేందుకు కారణమవుతున్న ప్రభుత్వానికి జీఎస్టీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించింది. కనీస వైద్యం అందించలేని గవర్నమెంట్ 18 శాతం జీఎస్టీ చెల్లించాలన్న నిబంధనను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది. ఇంతటి అసమర్థపు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఫైర్ అయింది.