వైద్యులు, నర్సులు, సఫాయి కార్మికులపై దాడి తగదు: ప్రధాని
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, సఫాయి కార్మికుల పట్ల అపోహలు పెంచుకుని, వారిపై దాడికి దిగడం సరికాదు, ఎట్టిపరిస్థితుల్లో అది ఆమోదయోగ్యం కాదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. వారిపట్ల హింస, దాడి, దురుసుతనాన్ని సహించేది లేదని అన్నారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ప్రారంభిస్తూ ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో సంభాషించారు. ఈ కరోనా మహమ్మారి లేకుంటే ఈ ప్రత్యేకమైన రోజును బెంగుళూరు […]
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, సఫాయి కార్మికుల పట్ల అపోహలు పెంచుకుని, వారిపై దాడికి దిగడం సరికాదు, ఎట్టిపరిస్థితుల్లో అది ఆమోదయోగ్యం కాదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. వారిపట్ల హింస, దాడి, దురుసుతనాన్ని సహించేది లేదని అన్నారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ప్రారంభిస్తూ ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో సంభాషించారు. ఈ కరోనా మహమ్మారి లేకుంటే ఈ ప్రత్యేకమైన రోజును బెంగుళూరు వెళ్లి వారందరితో కలిసి నిర్వహించుకునేవారని చెప్పారు. ఈ సందర్భంగా కరోనా గురించి మాట్లాడారు. కరోనా మహమ్మారి కంటికి కనిపించని వైరస్ కావొచ్చు కానీ, మన వైద్యులు అజేయులని చెప్పారు. కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధంలో మన వైద్యులదే అంతిమంగా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మనదేశంలో కరోనా పోరులో క్షేత్రస్థాయిలో యుద్ధం చేస్తు్న్నది వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందేనని గుర్తుచేశారు. ఒకరకంగా వీరంతా ఆర్మీ యూనిఫారం లేని సైనికులేనని అన్నారు.