కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కృషి: మేయర్

దిశ, నిజామాబాద్: కరోనా నేపథ్యంలో ప్రజాశ్రేయస్సు కోసం నిర్విరామంగా పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కృషి చేస్తోందని నిజామాబాద్ మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట రాష్ర్ట కార్మికశాఖ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఆమె ఆవిష్కరించారు. అనంతరం కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కార్మికుల కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి ప్రొత్సాహకాలను ప్రకటించి, ఆరోగ్య భద్రతకు అన్ని […]

Update: 2020-05-01 00:22 GMT

దిశ, నిజామాబాద్: కరోనా నేపథ్యంలో ప్రజాశ్రేయస్సు కోసం నిర్విరామంగా పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కృషి చేస్తోందని నిజామాబాద్ మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట రాష్ర్ట కార్మికశాఖ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఆమె ఆవిష్కరించారు. అనంతరం కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కార్మికుల కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి ప్రొత్సాహకాలను ప్రకటించి, ఆరోగ్య భద్రతకు అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. నిజామాబాద్ నగరంలో పనిచేస్తున్న కార్మికులకు నగర ఎమ్మెల్యే గణేశ్ గుప్తా మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేసి తనవంతు సహాకారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కేవీ అధ్యక్షరాలు విజయలక్ష్మి, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

Tags: Mayor, Nizamabad, flag, May Day, trskv, Municipal Corporation

Tags:    

Similar News