ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి
దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శుక్రవారం రెండుచోట్ల ఎదురుకాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. సుక్మా జిల్లా చింతల్‌నార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తాడిమెట్ల అటవీప్రాంతంలో కోబ్రా 201, డీఆర్‌జీ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడిన మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణార్థం భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపినట్లు సుక్మా ఎస్‌పి సునీల్ శర్మ తెలిపారు. కాల్పులు ఆగిన తర్వాత సంఘటన ప్రాంతంలో వెతికిన భద్రతా బలగాలు ఒక మావోయిస్టు మృతదేహం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. ఇదిలా […]
దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శుక్రవారం రెండుచోట్ల ఎదురుకాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. సుక్మా జిల్లా చింతల్‌నార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తాడిమెట్ల అటవీప్రాంతంలో కోబ్రా 201, డీఆర్‌జీ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడిన మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణార్థం భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపినట్లు సుక్మా ఎస్‌పి సునీల్ శర్మ తెలిపారు. కాల్పులు ఆగిన తర్వాత సంఘటన ప్రాంతంలో వెతికిన భద్రతా బలగాలు ఒక మావోయిస్టు మృతదేహం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. ఇదిలా ఉండగా బీజాపూర్ జిల్లా మద్దేడు అటవీప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు నడుమ జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఒక డీఆర్‌జీ జవాన్ గాయపడ్డారు. ఎదురుకాల్పుల్లో గాయపడిన జవాన్‌ని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సుమారు గంటకుపైగా ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. కాల్పుల అనంతరం మావోయిస్టుల శిబిరం వద్ద సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురుకాల్పుల ఘటనని బీజాపూర్ ఎస్‌పి కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.