బాత్రూమ్లో ఆమెపై అత్యాచారం, హత్య.. 25 ఏళ్ల తర్వాత ఈ ఒక్క క్లూతో నిందితుడు దొరికిపోయాడు
దిశ, వెబ్ డెస్క్: రెస్టారెంట్ లో పనిచేసే మహిళపై బాత్ రూమ్ లో అత్యాచారం చేసి, ఆపై ఆమెను హత్య చేసిన ఘటనలో డీఎన్ఏ టెస్ట్ తో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 25 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసులో దోషులెవరో కోర్టు తేల్చేసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో పని చేసే మహిళపై రెస్టారెంట్ బాత్ రూమ్ లో 1996 సంవత్సరంలో సెప్టెంబర్ 24న అత్యాచారం చేసి, హత్య చేశారు. తెల్లారి విధుల్లోకి […]
దిశ, వెబ్ డెస్క్: రెస్టారెంట్ లో పనిచేసే మహిళపై బాత్ రూమ్ లో అత్యాచారం చేసి, ఆపై ఆమెను హత్య చేసిన ఘటనలో డీఎన్ఏ టెస్ట్ తో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 25 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసులో దోషులెవరో కోర్టు తేల్చేసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో పని చేసే మహిళపై రెస్టారెంట్ బాత్ రూమ్ లో 1996 సంవత్సరంలో సెప్టెంబర్ 24న అత్యాచారం చేసి, హత్య చేశారు. తెల్లారి విధుల్లోకి చేరేందుకు వచ్చిన రెస్టారెంట్ ఇతర సిబ్బంది ఇది గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ వివరాలను కోర్టుకు సమర్పించారు. అయితే, 25 ఏళ్లపాటు ఈ కేసు కొనసాగింది. డీఎన్ఏ పరీక్షలో వాస్తవాలేమిటో తెలియడంతో దోషి ఎవరో తేలిపోయింది. ఇందుకు సంబంధించి కోర్టు తీర్పు వెల్లడించింది. 25 ఏళ్లపాటు కొనసాగిన ఈ కేసులో ఎంతోమంది ఎన్నో విధాలుగా పోరాడారు. చివరికి ఈ విధంగా ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.