2 శాతం ధరలు పెంచిన మారుతీ సుజుకి.. ఎందుకంటే?

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్యాసింజర్ వాహన తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకి గతవారం తీసుకున్న తన కార్ల ధరల పెంపు నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. గత కొంతకాలంగా విడిభాగాల ఖర్చులు, ఇన్‌పుట్ వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. వాహనాల తయారీ, ముడిసరుకుల ఖర్చులు, నిర్వహణలో పెరుగుతున్న వ్యయం వల్ల పలు మోడళ్లపై ఈ ధరల పెంపు ఉంటుందని, దేశవ్యాప్తంగా ఈ పెరుగుదల 1.9 శాతం […]

Update: 2021-09-06 04:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్యాసింజర్ వాహన తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకి గతవారం తీసుకున్న తన కార్ల ధరల పెంపు నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. గత కొంతకాలంగా విడిభాగాల ఖర్చులు, ఇన్‌పుట్ వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

వాహనాల తయారీ, ముడిసరుకుల ఖర్చులు, నిర్వహణలో పెరుగుతున్న వ్యయం వల్ల పలు మోడళ్లపై ఈ ధరల పెంపు ఉంటుందని, దేశవ్యాప్తంగా ఈ పెరుగుదల 1.9 శాతం వరకు ఉంటుందని వివరించింది. కంపెనీ బడ్జెట్ రేంజ్ మోడల్ సెలెరియో మినహా అన్ని కార్ల ధరలను పెంచామని కంపెనీ పేర్కొంది. కాగా, ప్రస్తుత ఏడాదిలో ఇప్పటికే పలుమార్లు మారుతీ సుజుకి కార్ల ధరలను పెంచింది. జనవరిలో ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 34 వేల వరకు పెంచగా, ఏప్రిల్‌లో 1.6 శాతం పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. అనంతరం జూలైలో హ్యాచ్‌బ్యాక్ విభాగంలో స్విఫ్ట్ కార్లతో పాటు సీఎన్‌జీ మోడళ్లపై రూ. 15 వేల వరకు పెంచింది. అయితే, ఇన్‌పుట్ ఖర్చుల భారం కొనసాగుతుండటంతో మరోసారి కార్ల ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకుంది.

Tags:    

Similar News