ఇకనుంచి ఇంటి గుమ్మంలోనే వదిలి వెళ్తాడంట!
దిశ, సెంట్రల్ డెస్క్: హోటల్, రెస్టారెంట్ దిగ్గజం మారియెట్ ఇంటర్నేషనల్ సంస్థతో ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియాలో తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించడానికి జొమాటోతో జతకట్టనున్నట్టు మారియెట్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ప్రస్తుతం ‘మారియేట్ ఆన్ వీల్స్’ పేరుమీద మీల్స్, క్యాటరింగ్ సేవలను అందిస్తున్నట్టు పేర్కొంది. వినియోగదారులకు వీలైనంత వేగంగా ఫుడ్ డెలివరీ చేయడమే లక్ష్యంగా రెండు సంస్థలు కలిసి పని చేయనున్నట్టు తెలిపాయి. ఈ ఒప్పందం గురించి స్పందించిన మారియెట్ దక్షిణాసియా […]
దిశ, సెంట్రల్ డెస్క్: హోటల్, రెస్టారెంట్ దిగ్గజం మారియెట్ ఇంటర్నేషనల్ సంస్థతో ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియాలో తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించడానికి జొమాటోతో జతకట్టనున్నట్టు మారియెట్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ప్రస్తుతం ‘మారియేట్ ఆన్ వీల్స్’ పేరుమీద మీల్స్, క్యాటరింగ్ సేవలను అందిస్తున్నట్టు పేర్కొంది. వినియోగదారులకు వీలైనంత వేగంగా ఫుడ్ డెలివరీ చేయడమే లక్ష్యంగా రెండు సంస్థలు కలిసి పని చేయనున్నట్టు తెలిపాయి. ఈ ఒప్పందం గురించి స్పందించిన మారియెట్ దక్షిణాసియా వైస్ ప్రెసిడెంట్ నీరజ్ గోవిల్.. జొమాటోతో ఒప్పందం వల్ల వినియోగదార్లకు వేగంగా సేవలందించేందుకు అవకాశముంటుందని తెలిపారు. అలాగే, మారియెట్ కంపెనీతో కలిని పనిచేయడం ద్వారా అభివృద్ధి సాధిస్తామని జొమాటో తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రత విషయంలో తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. అన్ని ప్రీ-పెయిడ్ ఆర్డర్‌లలో కాంటాక్ట్‌లెస్ డెలివరీని అమలు చేస్తామని జోమాటో తెలిపింది. ఈ విధానంలో డెలివరీ చేసే వ్యక్తి ఆహారాన్ని ఇంటి గుమ్మంలో వదిలి వెళ్తాడు. ఆహార భద్రత విషయంలో ఎటువంటి లోపం ఉండకుండా అన్ని మారియట్ ప్రదేశాలలో జొమాటో డెలివరీ భాగస్వాములకు శానిటైజేషన్ ఏర్పాటు చేస్తామని కంపెనీ తెలిపింది. ఇదే క్రమంలో, జొమాటో ఇటీవల వినియోగదారులను ఆకర్షించడానికి పలు వ్యూహాలౌ సిద్ధం చేస్తోంది. తాజాగా డ్రోన్లను ఉపయోగించి ఫుడ్ డెలివరీ ప్రారంభించినట్టు జొమాటో ప్రకటించింది.