ఆర్థిక విషయాల్లో వామపక్ష సిద్ధాంతాలను, నైతిక విషయాల్లో సంప్రదాయ పార్టీల స్వభావాన్ని కలిగివున్న ఆమ్‌ఆద్మీని సెంట్రిస్టు(మధ్యేవాద) పార్టీగా పరిగణించవచ్చు. రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీలకు సమదూరంలో ఉండడం, ఇరుపార్టీల విధానాల పైనా విరుచుకుపడడాన్ని మనం గమనించవచ్చు. భారత రాజ్యాంగంలో, పీఠికలో చెప్పిన సమానత్వం, సామాజిక న్యాయం తమ లక్ష్యమని, గాంధీ 'స్వరాజ్' భావనను విశ్వసిస్తామని పార్టీ నేతలు చెబుతుంటారు. కాగా, తమను నడిపించే సిద్ధాంతమేదీ లేదని, సామాన్య మానవుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే లెఫ్టిస్ట్, రైటిస్ట్ పార్టీల మద్దతు తీసుకుంటామని స్వయంగా కేజ్రీవాలే ఎన్నోమార్లు ప్రకటించారు. మొదటిదఫా ఢిల్లీలో తప్ప పార్టీ ఇప్పటివరకు ప్రధానపార్టీలతో పొత్తు పెట్టుకున్న చరిత్ర లేదు.
ఆప్ మొట్టమొదట పాగా వేసిన ఢిల్లీలో కాంగ్రెస్ పత్తా లేకుండాపోయింది. బీజేపీ కూడా దెబ్బతిన్నా ఆ వెంటనే కోలుకుంది. సాధారణంగా కాంగ్రెస్, అకాలీదళ్‌ల మధ్య అధికార మార్పిడి జరిగే పంజాబ్‌లో ఆప్ ప్రవేశించిన తర్వాత హస్తం పార్టీ ఓడిపోయింది. కమలనాథులు గెలువకున్నా కాంగ్రెస్ ఖాతా నుంచి మరో రాష్ట్రం చేజారడం వాళ్లకు అనుకూల పరిణామం. గోవా ఎన్నికల్లో సైతం ఆప్ 7శాతం ఓట్లను సాధించి కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేయడంలో తృణమూల్‌కు తోడుగా నిలిచింది. ఇక గుజరాత్‌లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఓడిపోతుందనుకున్న కాషాయదళం ఆప్ చలవతో భారీ మెజారిటీతో విజయం సాధించింది. 2017 ఎన్నికల్లో గెలుపు అంచుల దాకా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక కారణంగా వెనుకబడిపోయింది.
ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లోనూ సరిగ్గా ఇదే జరగబోతోంది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించిన ఆమ్‌ఆద్మీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను భారీగా చీల్చడం ఖాయం. అంతేకాకుండా, సాధారణంగా మతవాద బీజేపీకి దూరంగా ఉండే మైనారిటీలు, దళితులు, వామపక్ష ఓట్లల్లో కొంత శాతాన్ని సైతం ఆప్ తన ఖాతాలో వేసుకుంటుంది. మాజీ సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీ(ఎస్) సైతం ఇదే పాత్రను నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్‌కు సన్నిహితంగా ఉన్న ఆయన ఎలాంటి పొత్తులూ లేకుండా సొంతంగానే పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్లు బెంగళూరు వర్గాల సమాచారం. ఇదే జరిగితే, ఆప్, జేడీ(ఎస్) కలిసి కర్ణాటకలో సక్సెస్‌ఫుల్‌గా కాంగ్రెస్‌ను ఓడగొట్టినవాళ్లవుతారు.
త్వరలో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆమ్‌ఆద్మీ పార్టీ(AAP) నేత అతిషీ ప్రకటించారు. మొత్తం 224 స్థానాల్లోనూ బరిలో దిగుతామని, మార్చ్ మొదటివారంలో అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్ అమలుచేస్తున్న పథకాలను కర్ణాటకలో కాపీ కొడుతున్నాయని ఆరోపించారు. పార్టీ కర్ణాటక అధ్యక్షుడు పృథ్వీరెడ్డి కూడా ఇదే విషయాన్ని అనేక సభల్లో ప్రకటించారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్)ల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రబలిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఏడాది బెంగళూరులో నిర్వహించిన ఓ భారీ సభలో పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 20శాతం కమీషన్ తీసుకునే సర్కార్ పోయి 40శాతం తీసుకునే సర్కార్ వచ్చిందని, అవినీతిని జీరో పర్సెంట్‌కు తెచ్చే తమ పార్టీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు.
ఆప్ జాతీయ పార్టీ అయింది
పదేళ్ల కిందట ఆవిర్భవించిన ఆప్, ఏడాది తిరగకుండానే రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు 28 సాధించి కాంగ్రెస్ మద్దతుతో అధికారం సాధించింది. కేజ్రీవాల్ సీఎం అయ్యారు. 2013 ఫిబ్రవరిలో జనలోక్‌పాల్ బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టగా, కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేకించడంతో వీగిపోయింది. నైతిక బాధ్యతగా ఆప్ ప్రభుత్వం రాజీనామా సమర్పించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 67 స్థానాలు సాధించి ప్రతిపక్షాలను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టింది. మూడవ దఫా 2020లోనూ 62 సీట్లు సాధించి ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఏకఛత్రాధిపత్యాన్ని చాటింది. ఢిల్లీ గెలుపు ఇచ్చిన స్ఫూర్తితో అనేక రాష్ట్రాల్లో శాఖలను విస్తరింపజేసింది. 2022 మార్చ్‌లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్‌లను వెనక్కి నెట్టేసి భారీ విజయాన్ని నమోదు చేసింది. 2017 నుంచీ యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ సహా 18 రాష్ట్రాల ఎన్నికల్లో బరిలో నిలిచింది. గుజరాత్‌లో ఐదు, గోవాలో రెండు స్థానాలు మినహా మరెక్కడా గెలువకపోయినా, పలు రాష్ట్రాల్లో తన ఉనికిని చాటుకుంది. ఇటీవలే భారత ఎన్నికల కమిషన్ చేత జాతీయపార్టీగా గుర్తింపు పొందింది.
ఆర్థిక విషయాల్లో వామపక్ష సిద్ధాంతాలను, నైతిక విషయాల్లో సంప్రదాయ పార్టీల స్వభావాన్ని కలిగివున్న ఆమ్‌ఆద్మీని సెంట్రిస్టు(మధ్యేవాద) పార్టీగా పరిగణించవచ్చు. రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీలకు సమదూరంలో ఉండడం, ఇరుపార్టీల విధానాల పైనా విరుచుకుపడడాన్ని మనం గమనించవచ్చు. భారత రాజ్యాంగంలో, పీఠికలో చెప్పిన సమానత్వం, సామాజిక న్యాయం తమ లక్ష్యమని, గాంధీ 'స్వరాజ్' భావనను విశ్వసిస్తామని పార్టీ నేతలు చెబుతుంటారు. కాగా, తమను నడిపించే సిద్ధాంతమేదీ లేదని, సామాన్య మానవుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే లెఫ్టిస్ట్, రైటిస్ట్ పార్టీల మద్దతు తీసుకుంటామని స్వయంగా కేజ్రీవాలే ఎన్నోమార్లు ప్రకటించారు. మొదటిదఫా ఢిల్లీలో తప్ప పార్టీ ఇప్పటివరకు ప్రధానపార్టీలతో పొత్తు పెట్టుకున్న చరిత్ర లేదు.
మోడీ గద్దెను కాపాడటమే లక్ష్యం
అయితే, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏ కనుసన్నల్లో నడుస్తోందనే ఆరోపణలు ఆప్‌పైన ఉన్నాయి. ఫోర్డ్ ఫౌండేషన్ తదితర అనుమానిత సంస్థల నుంచి నిధులు అందుతున్నాయని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే రైటిస్ట్ బీజేపీకి అనుకూలించే వ్యూహాలను, ఎత్తుగడలను అనుసరిస్తోందనే వారూ లేకపోలేదు. ఎక్కడ ఆప్ ఎన్నికలలో పోటీ చేస్తుందో అక్కడ కాంగ్రెస్ నష్టపోతోందని, కమలం పార్టీ లాభపడుతోందని వాళ్లు వాదిస్తున్నారు. బీజేపీని ఢీకొనగలిగిన సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ఎత్తుగడలు అవలంభించడమంటే అంతిమంగా మోడీ గద్దెను కాపాడడమేనని ఆరోపిస్తున్నారు.
గత పదేళ్ల చరిత్ర పరిశీలిస్తే, అది నిజమేనన్న అనుమానాలు కలుగుతాయి. ఆప్ మొట్టమొదట పాగా వేసిన ఢిల్లీలో కాంగ్రెస్ పత్తా లేకుండాపోయింది. బీజేపీ కూడా దెబ్బతిన్నా ఆ వెంటనే కోలుకుంది. సాధారణంగా కాంగ్రెస్, అకాలీదళ్‌ల మధ్య అధికార మార్పిడి జరిగే పంజాబ్‌లో ఆప్ ప్రవేశించిన తర్వాత హస్తం పార్టీ ఓడిపోయింది. కమలనాథులు గెలువకున్నా కాంగ్రెస్ ఖాతా నుంచి మరో రాష్ట్రం చేజారడం వాళ్లకు అనుకూల పరిణామం. గోవా ఎన్నికల్లో సైతం ఆప్ 7శాతం ఓట్లను సాధించి కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేయడంలో తృణమూల్‌కు తోడుగా నిలిచింది. ఇక గుజరాత్‌లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఓడిపోతుందనుకున్న కాషాయదళం ఆప్ చలవతో భారీ మెజారిటీతో విజయం సాధించింది. 2017 ఎన్నికల్లో గెలుపు అంచుల దాకా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక కారణంగా వెనుకబడిపోయింది.
అడుగుపెడితే చాలు ఓట్లు చీలతాయ్
ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లోనూ సరిగ్గా ఇదే జరగబోతోంది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించిన ఆమ్‌ఆద్మీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను భారీగా చీల్చడం ఖాయం. అంతేకాకుండా, సాధారణంగా మతవాద బీజేపీకి దూరంగా ఉండే మైనారిటీలు, దళితులు, వామపక్ష ఓట్లల్లో కొంత శాతాన్ని సైతం ఆప్ తన ఖాతాలో వేసుకుంటుంది. మాజీ సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీ(ఎస్) సైతం ఇదే పాత్రను నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్‌కు సన్నిహితంగా ఉన్న ఆయన ఎలాంటి పొత్తులూ లేకుండా సొంతంగానే పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్లు బెంగళూరు వర్గాల సమాచారం. ఇదే జరిగితే, ఆప్, జేడీ(ఎస్) కలిసి కర్ణాటకలో సక్సెస్‌ఫుల్‌గా కాంగ్రెస్‌ను ఓడగొట్టినవాళ్లవుతారు. పోస్ట్ పోల్ సీన్‌లో సైతం ఆమ్‌ఆద్మీ కాంగ్రెస్‌తో పొత్తుకు వెళ్లే అవకాశం లేదు. అప్పుడు జేడీ(ఎస్) లోపాయికారీ మద్దతుతోనో, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చు. అసలు లోగుట్టు ప్రజలకు అర్థమై ఏకపక్షంగా ఓటేస్తే తప్ప కాంగ్రెస్ మరోసారి అధికారానికి రావడం కష్టమే.
ఇలాంటి ఆరోపణలు రాకూడదంటే బీజేపీ, కాంగ్రెస్‌ల పట్ల ఆప్ తన వైఖరిని మరోమారు స్పష్టం చేయాలి. శత్రువుకు శత్రువు మిత్రుడన్న నానుడిని ఎత్తుగడల పరంగానైనా ఆచరించాలి. బీజేపీ పాలన దేశానికి అరిష్టంగా పరిణమించిందని, కాంగ్రెస్ కంటే ఆ పార్టీయే అవినీతిలోనూ, కార్పొరేట్ సాన్నిహిత్యంలోనూ ముందుందని మాటల్లో చెప్పడం కాదు.. చేతల్లో చూపించాలి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కమలదళాన్ని ఓడించడానికి శాయశక్తులా కృషి చేయాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలి. ఎన్నికలకు ముందో, తర్వాతో పొత్తులకు సిద్ధం కావాలి. ప్రభుత్వాల ఏర్పాటులో భాగస్వామ్యం వహించాలి. అలా కాకుండా కేసీఆర్ బీఆర్ఎస్ లాగానే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్.. రెండింటికీ సమదూరంలో ఉంటామని చెప్పడం అనుమానాలకు తావిస్తుంది. నిజంగానే బీజేపీకి ఈ పార్టీ కూడా బీ టీమా అన్న చర్చ బలపడుతుంది.
- డి మార్కండేయ
Also Read...