మారికో నికర లాభం 23 శాతం వృద్ధి!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం మారికో 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 23.17 శాతం వృద్ధితో రూ. 388 కోట్లుగా ఉన్నట్టు, గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 315 కోట్లని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అయితే, కార్యకలాపాలా నుంచి ఆదాయం 11 శాతం క్షీణించి రూ. 1,925 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ. 2,166 కోట్లని, కొవిడ్-19 ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ […]

Update: 2020-07-27 07:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం మారికో 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 23.17 శాతం వృద్ధితో రూ. 388 కోట్లుగా ఉన్నట్టు, గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 315 కోట్లని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అయితే, కార్యకలాపాలా నుంచి ఆదాయం 11 శాతం క్షీణించి రూ. 1,925 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ. 2,166 కోట్లని, కొవిడ్-19 ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో సరఫరా వ్యవస్థలో అంతరాయం ఎదుర్కొన్నామని కంపెనీ పేర్కొంది.

ఏప్రిల్ నెలలో దేశీయ వ్యాపారంలో తీవ్రత అధికంగా ఉందని, ఆ తర్వాత ఆంక్షల సడలింపుతో మే, జూన్ నెలల్లో కొంత సానుకూలత నమోదు చేసినట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య దేశీయ అమ్మకాలు 14.50 శాతం తగ్గి రూ. 1,480 కోట్లకు చేరుకున్నాయి. అంతకుముందు ఇదే కాలంలో అమ్మకాల విలువ రూ. 1,731 కోట్లుగా నమోదైంది. అంతర్జాతీయంగా వచ్చే ఆదాయం 2.29 శాతం పెరిగి రూ. 445 కోట్లకు చేరుకున్నట్టు కంపెనీ పేర్కొంది. అయితే, నిర్వహణ లాభం 1 శాతం మాత్రమే పెరిగి రూ. 467 కోట్లుగా ఉందని, స్థూల మార్జిన్లు 24.3 శాతానికి చేరుకున్నాయని కంపెనీ పేర్కొంది. సమీక్షించిన త్రైమాసికంలో మెరికో కరోనాను దృష్టిలో ఉంచుకుని మెడికేర్ హ్యాండ్ శానిటైజర్, క్లీనింగ్ ఉత్పత్తులను ప్రారంభించడం ద్వారా హైజీన్ విభాగంలోకి ప్రవేశించినట్టు, ఈ ఫ్రాంచైజీలో వృద్ధి సాధించేందుకు మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపింది.

Tags:    

Similar News