పోలీసుల తీరుపై మక్సూద్ బంధువుల అభ్యంతరం

దిశ, వరంగల్: వరంగల్ శివారు గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసుకు సంబంధించి పోలీసులు చెప్పిన విషయాలపై మక్సూద్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం మక్సూద్ కుటుంబ సభ్యులు వరంగల్‌కు చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి వరంగల్ ఎంజీఎంకు వచ్చిన కుటుంబ సభ్యులు హత్యోదంతంపై మాట్లాడారు. హత్యపై పోలీసులు చెప్పిన విషయాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంజయ్ ఒక్కడే తొమ్మిది మందిని తీసుకెళ్లి బావిలో ఎలా పడేస్తాడని అది అసాధ్యమన్నారు. సంజయ్‌తోపాటు మరికొంత మంది […]

Update: 2020-05-26 01:55 GMT

దిశ, వరంగల్: వరంగల్ శివారు గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసుకు సంబంధించి పోలీసులు చెప్పిన విషయాలపై మక్సూద్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మంగళవారం మక్సూద్ కుటుంబ సభ్యులు వరంగల్‌కు చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి వరంగల్ ఎంజీఎంకు వచ్చిన కుటుంబ సభ్యులు హత్యోదంతంపై మాట్లాడారు. హత్యపై పోలీసులు చెప్పిన విషయాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంజయ్ ఒక్కడే తొమ్మిది మందిని తీసుకెళ్లి బావిలో ఎలా పడేస్తాడని అది అసాధ్యమన్నారు. సంజయ్‌తోపాటు మరికొంత మంది ఈ కేసులో పాల్గొని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.‌ ఈ కేసుకు సంబంధించి పోలీసులు మళ్లీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతదేహాలకు ఇక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామని మక్సూద్ కుటుంబసభ్యులు తెలిపారు.

Tags:    

Similar News