హరిభూషణ్, భారతక్కలకు విప్లవ జేజేలు

దిశ, భద్రాచలం : ఇటీవల కరోనాతో చనిపోయిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ (యాప నారాయణ), దండకారణ్యం మాడ్ డివిజన్ ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు భారతక్క (సిద్ధబోయిన సారక్క) లకు విప్లవ జేజేలు పలుకుతూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరున పోస్టర్లు వెలిశాయి. చర్ల శివారులోని లెనిన్‌కాలనీ వద్ద రహదారి ప్రక్కన చెట్లకు కొట్టి, రోడ్డు పొడవున ఈ పోస్టర్లు పడేసి ఉన్నాయి. హరిభూషణ్, భారతక్కల బాటలో పయనిద్దాం. ఈ ఆదర్శ త్యాగధనుల […]

Update: 2021-06-30 10:33 GMT

దిశ, భద్రాచలం : ఇటీవల కరోనాతో చనిపోయిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ (యాప నారాయణ), దండకారణ్యం మాడ్ డివిజన్ ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు భారతక్క (సిద్ధబోయిన సారక్క) లకు విప్లవ జేజేలు పలుకుతూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరున పోస్టర్లు వెలిశాయి. చర్ల శివారులోని లెనిన్‌కాలనీ వద్ద రహదారి ప్రక్కన చెట్లకు కొట్టి, రోడ్డు పొడవున ఈ పోస్టర్లు పడేసి ఉన్నాయి. హరిభూషణ్, భారతక్కల బాటలో పయనిద్దాం. ఈ ఆదర్శ త్యాగధనుల ఆశయాలను మనమంతా పూర్తి చేద్దాం. కరోనా మహమ్మారిని సృష్టించిన సామ్రాజ్యవాదులను నిర్మూలిద్దాం. కరోనాని జయిద్దాం, ప్రజావిముక్తిని సాధిద్దాం, నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గమే ప్రజల విముక్తికి సరైన మార్గం. నూతన ప్రజాస్వామిక విప్లవం వర్థిల్లాలి అని పోస్టర్లలో పేర్కొన్నారు.

Tags:    

Similar News