బొగ్గు ఉత్పత్తిలో రికార్డు క్రియేట్ చేసిన మణుగూరు గని
దిశ, మణుగూరు : మణుగూరు సింగరేణి బొగ్గుగనిలో కార్మికులందరి కృషి, ఐక్యతనే అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని మణుగూరు సింగరేణి జీఎం జక్కం రమేష్ తెలిపారు. మంగళవారం మండలంలోని సింగరేణి జీఎం కార్యాలయంలో ఎస్ఓటు జీఎం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీఎం రమేష్ మాట్లాడుతూ.. కార్మికులందరి కృషితో బొగ్గు ఉత్పత్తి తీయడంలో, బొగ్గు రవాణా చేయడంలో మణుగూరు ప్రాంతమే నెంబర్ వన్ అని పేర్కొన్నారు. ఆగస్టు నెల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 8,13,000 […]
దిశ, మణుగూరు : మణుగూరు సింగరేణి బొగ్గుగనిలో కార్మికులందరి కృషి, ఐక్యతనే అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని మణుగూరు సింగరేణి జీఎం జక్కం రమేష్ తెలిపారు. మంగళవారం మండలంలోని సింగరేణి జీఎం కార్యాలయంలో ఎస్ఓటు జీఎం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జీఎం రమేష్ మాట్లాడుతూ.. కార్మికులందరి కృషితో బొగ్గు ఉత్పత్తి తీయడంలో, బొగ్గు రవాణా చేయడంలో మణుగూరు ప్రాంతమే నెంబర్ వన్ అని పేర్కొన్నారు. ఆగస్టు నెల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 8,13,000 లక్షల టన్నులు కాగా 9,83,913 లక్షల టన్నుల బొగ్గును.. అనగా 121% బొగ్గు ఉత్పత్తితో సింగరేణిలో మణుగూరే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
సింగరేణిలో పని చేసే కార్మికులందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించామని ఈ సందర్భంగా తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ కార్మికులను సన్మానించినట్టు వెల్లడించారు. అలాగే 2019-2020 సంవత్సరానికి గాను 633 మంది సివిల్ కాంట్రాక్ట్ కార్మికులకు సీఎంపీఎఫ్ పాస్ పుస్తకాలను మంజూరు చేశామన్నారు.
కొన్ని రోజుల క్రితం సింగరేణి ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ కార్మికుడికి సింగరేణి తరఫున మొదటి విడతగా లక్ష రూపాయల చెక్కును ఆ కుటుంబానికి ఆర్థికసహాయంగా ఇచ్చామని అన్నారు. 2021 సంవత్సరంలో హరితహారంలో భాగంగా మణుగూరు ఓసీలో ఒక్కరోజే 20వేల మొక్కలు నాటమని చెప్పారు. మరో 5 వేల పూలు, పండ్ల మొక్కలు పరిసర గ్రామల ప్రజలకు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
అలాగే కరోనా బారినపడి మరణించిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల
చెక్కులను అందించామని ఈ సందర్బంగా తెలిపారు. అలాగే సింగరేణి సేవా సభ్యులు, సింగరేణి వైద్య సిబ్బంది పీవీ కాలనీలో డెంగ్యూ వ్యాధి నివారణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణికి సంబంధించిన అన్ని డిపార్ట్‌మెంట్ల అధికారులు పాల్గొన్నారు.