‘ఆ నిర్ణయం వల్లే నిరుద్యోగం పెరిగిపోయింది’

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో నిరుద్యోగం అత్యధికంగా ఉందని, దీనికి ప్రధాని మోదీ 2016లో తీసుకున్న నోట్ల రద్దుతో పాటు ఇతర నిర్ణయాలే కారణమని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో జరిగిన రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ వర్చువల్ కార్యక్రమలో పాల్గొన్న ఆయన…సరైన ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయం నోట్ల రద్దు అని, దీనివల్ల అసంఘటిత రంగం కుదేలైందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం క్రమం […]

Update: 2021-03-02 11:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో నిరుద్యోగం అత్యధికంగా ఉందని, దీనికి ప్రధాని మోదీ 2016లో తీసుకున్న నోట్ల రద్దుతో పాటు ఇతర నిర్ణయాలే కారణమని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో జరిగిన రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ వర్చువల్ కార్యక్రమలో పాల్గొన్న ఆయన…సరైన ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయం నోట్ల రద్దు అని, దీనివల్ల అసంఘటిత రంగం కుదేలైందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపడం లేదని విమర్శించారు.

రుణాల సమస్యలపై ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ తాత్కాలిక చర్యలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను చిక్కుల్లో పడేస్తున్నాయన్నారు. దూరదృష్టి లేకుండా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల సంక్షోభం ఏర్పడి దేశవ్యాప్తంగా నిరుద్యోగం భారీగా పెరిగిందని, అసంఘటిత రంగం పూర్తిగా దెబ్బతిన్నదని వివరించారు. దేశంలోని రాష్ట్రల్లో ప్రభుత్వ నిధుల పరిస్థితి గందరగోళంగా మారిందని, రాష్ట్రాల ప్రభుత్వాలు మితిమీరిన రుణాలను తీసుకుంటున్నాయని, ఈ ప్రభావంతో భవిష్యత్తులో బడ్జెట్‌లపై భారం పెరిగిపోతోందని హెచ్చరించారు. రాష్ట్రాలతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు జరపడం రాజ్యంగ విధి అని, దేశ ఆర్థికవ్యవస్థకు, రాజకీయ సిద్ధాంతాలకు కీలకమని హితవు పలికారు.

ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వం ఈ అంశాలను పట్టించుకోవడంలేదన్నారు. కేరళలో సాంఘిక ప్రమాణాలు ఉత్తమంగా ఉన్నాయి. అయితే, భవిష్యత్తులో దృష్టి పెట్టాల్సిన రంగాలు ఉన్నాయని, అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సిన అంశాలున్నాయని అన్నారు. గత రెండు, మూడేళ్లలో అంతర్జాతీయంగా ఆర్థిక, వ్యాపార రంగాల్లో మొదలైన పతనం, కరోనా వల్ల పెరిగిందని, ఈ ప్రభావం కేరళ అంతర్జాతీయ ముఖచిత్రం బలహీనపడినట్టు మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల డిజిటలీకరణ వల్ల ఐటీ రంగం మెరుగ్గా ఉన్నప్పటికీ పర్యాటకం దెబ్బతిన్నదని అన్నారు.

Tags:    

Similar News