టీటీడీ ఆస్తులు ఎందుకు అమ్ముతున్నారు: మంచు మనోజ్
టీటీడీ ఆస్తుల అమ్మకం నిర్ణయంపై హీరో మంచు మనోజ్ తనదైన రీతిలో స్పందించారు. అసలు శ్రీవారి ఆస్తులు ఎందుకు అమ్మాలనుకుంటున్నారో వివరణ ఇవ్వాలని టీటీడీని కోరుతూ ట్విట్టర్లో ఓ లేఖ విడుదల చేశారు. ‘టీటీడీ ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా? చేసేది.. చెప్పేది అంతా టీటీడీ పాలక మండలే’ అంటూ చురకలంటించారు మనోజ్. టీటీడీ నిర్ణయంపై పలు పార్టీల నాయకులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, తిరుమల ఆస్తులను అమ్మితే.. అది చెడు సంప్రదాయంగా మారే […]
టీటీడీ ఆస్తుల అమ్మకం నిర్ణయంపై హీరో మంచు మనోజ్ తనదైన రీతిలో స్పందించారు. అసలు శ్రీవారి ఆస్తులు ఎందుకు అమ్మాలనుకుంటున్నారో వివరణ ఇవ్వాలని టీటీడీని కోరుతూ ట్విట్టర్లో ఓ లేఖ విడుదల చేశారు. ‘టీటీడీ ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా? చేసేది.. చెప్పేది అంతా టీటీడీ పాలక మండలే’ అంటూ చురకలంటించారు మనోజ్. టీటీడీ నిర్ణయంపై పలు పార్టీల నాయకులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, తిరుమల ఆస్తులను అమ్మితే.. అది చెడు సంప్రదాయంగా మారే ప్రమాదముందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయంపై మనోజ్ టీటీడీకి బహిరంగ లేఖ రాశారు.
‘ఓం నమో వెంకటేశాయ..
టీటీడీ ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా? కరోనా సంక్షోభంలో రోజుకు లక్ష మందికి ఆకలి తీర్చమని కూడా దేవుడు ఏమన్నా చెప్పాడా? చేసేది, చెప్పేది అంతా టీటీడీ పాలక మండలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను, కొండకి వచ్చిన లక్షలాది మందిని, సుప్రభాత సేవకి టైమ్ అయ్యింది నిద్ర లేవాలి.. అని శ్రీహరిని సైతం కంట్రోల్ చేసేది టీటీడీ పాలక మండలి. కొండపైనున్న వడ్డీ కాసులవాడి ఆస్తులు అమ్మకానికొచ్చాయంటే.. ‘గోవిందా గోవిందా’ అని అరచిన ఈ గొంతు కొంచెం తడబడింది. మోసం జరగట్లేదని తెలుసు. ఎందుకంటే ఇన్సైడ్ ట్రేడింగ్లా కాకుండా వేలం వేసి అందరి ముందూ అందరు చూస్తుండగానే అమ్మకం జరుపుతారు. కానీ, ఎందుకు అమ్ముతున్నారు?.. అని పాలక మండలిని కాస్త వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వివరణ మాత్రమే.. ఇంకేం లేదు సార్. ఇంత పెద్ద కొండ మాకు అండగా ఉంది అని చూస్తూ మురిసిపోయే తిరుపతి వాడిని కాబట్టి ఆపుకోలేక అడుగుతున్నా సార్.. అంతే’ జై హింద్’’ ఇట్లు మీ మంచు మనోజ్ అంటూ లేఖ రాశారు.