కరోనా బ్యాక్‌డ్రాప్‌లో గేమ్ రూపొందించిన బాలుడు!
దిశ, వెబ్‌డెస్క్ : ఒక్కసారి అలా ప్లాష్‌బ్యాక్ బటన్ నొక్కుదాం.. కరోనా వైరస్ భారత్‌తో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లోకి చొరబడింది. అంతకంటే ముందే చైనాలో కరోనా మరణ మృదంగం మోగించిన తీరుతో ఇండియాతో పాటు అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. మార్చి 23 నుంచి భారత్‌లో లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోయారు. పనులన్నీ ఆగిపోయాయి. సొంతూళ్లకు వెళ్లాలనుకునేవాళ్లు పడరాని పాట్లు పడ్డారు. ఎటు చూసినా పోలీసులు.. అంతటా నిర్మానుష్యం. కరోనా పాజిటివ్ కేసు వస్తే.. జనం […]
దిశ, వెబ్‌డెస్క్ :
ఒక్కసారి అలా ప్లాష్‌బ్యాక్ బటన్ నొక్కుదాం.. కరోనా వైరస్ భారత్‌తో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లోకి చొరబడింది. అంతకంటే ముందే చైనాలో కరోనా మరణ మృదంగం మోగించిన తీరుతో ఇండియాతో పాటు అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. మార్చి 23 నుంచి భారత్‌లో లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోయారు. పనులన్నీ ఆగిపోయాయి. సొంతూళ్లకు వెళ్లాలనుకునేవాళ్లు పడరాని పాట్లు పడ్డారు. ఎటు చూసినా పోలీసులు.. అంతటా నిర్మానుష్యం. కరోనా పాజిటివ్ కేసు వస్తే.. జనం వణికిపోయారు. మూడు నెలల పాటు ఇదే దృశ్యం. కట్ చేస్తే.. ఈ కరోనా లాక్‌డౌన్ బేస్ చేసుకుని తొమ్మిదో తరగతి చదివే ఓ చిన్నోడు.. ‘కోరో బాయ్’ అనే గేమ్‌ను రూపొందించాడు.
కరోనా కాలంలో పెద్దోళ్లే వణికిపోయారు. ఇక చిన్నారుల పరిస్థితి వేరే చెప్పాలా? అలాంటిది మణిపూర్, ఇంపాల్‌కు చెందిన పదమూడేళ్ల బల్దీప్ నింగ్‌టోజామ్.. కరోనా నేపథ్యంలో గేమ్‌ను రూపొందించి ఔరా అనిపించాడు. కోరోబాయ్ (Coroboi) అనే బాలుడు.. మణిపూర్ సంప్రదాయ వస్త్రాలు (లిరమ్ పీ) వేసుకుంటాడు. అయితే లాక్‌డౌన్ వల్ల ఈ కుర్రాడు చిక్కుకుపోతాడు. కాగా, ఆ బాలుడిని సురక్షితంగా వాళ్ల గ్రామానికి చేర్చితే, గేమ్‌లో విజయం సాధించినట్లే. ఈ క్రమంలో అతడు రోడ్డు వెంట పరుగెడుతూ ఉంటే.. మధ్యమధ్యలో కరోనా వైరస్ బాల్స్ వస్తుంటాయి. వాటిని తప్పించుకుంటూ, మార్గంలో లభించే పండ్లను అందుకుంటూ.. పోలీసులకు చిక్కకుండా వెళ్లాలి. ఒకవేళ పోలీసులకు దొరికితే.. ఫైన్ కింద 5 వేల పాయింట్లు పోతాయి. అప్పటివరకు సాధించిన పాయింట్ల నుంచి వీటిని కట్ చేస్తారు. కాగా, ఈ గేమ్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.
‘ఎథికల్ హ్యాకర్ కావాలనుకుంటున్న బల్దీప్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర టెక్నాలజీల గురించి మరింత తెలుసుకోవాలని చెబుతున్నాడు. ‘మా మామయ్య ఇచ్చిన సలహాతోనే ఈ గేమ్‌ను తయారుచేశాను, నాకు ఇదంతా కొత్త. కానీ 3-4 వారాల పాటు గేమ్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవడానికి యూట్యూబ్ వీడియోలు చూశాను. అంతే.. ఆ తర్వాత సొంతంగా ఈ వీడియో గేమ్ రూపొందించాను. శుక్రవారం రోజు కోరో బాయ్‌ను విడుదల చేశాను’ అని బల్దీప్ నింగ్‌టోజామ్ చెబుతున్నాడు.