అక్రమాలు.. నిలదీసినందుకు తూకం నిలిపివేత (వీడియో)
దిశ, మల్యాల: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తయారైంది రాష్ట్రంలో రైతుల పరిస్థితి. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని పలు గ్రామాలలోని ఐకేపీ సెంటర్‌లో క్వింటాలు వడ్లకు 6 నుండి 8 కిలోల వరకు తాలు పేరుతో తీసేస్తున్నారని, తేమశాతం పేరుతో కోత విధిస్తున్నారని, తూకంలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మల్యాల మండలంలోని గొల్లపల్లె గ్రామానికి చెందిన రైతు గడ్డం నాగరాజు పండించిన పంట తూకం వేసే సమయంలో లారీలు […]
దిశ, మల్యాల: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తయారైంది రాష్ట్రంలో రైతుల పరిస్థితి. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని పలు గ్రామాలలోని ఐకేపీ సెంటర్‌లో క్వింటాలు వడ్లకు 6 నుండి 8 కిలోల వరకు తాలు పేరుతో తీసేస్తున్నారని, తేమశాతం పేరుతో కోత విధిస్తున్నారని, తూకంలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మల్యాల మండలంలోని గొల్లపల్లె గ్రామానికి చెందిన రైతు గడ్డం నాగరాజు పండించిన పంట తూకం వేసే సమయంలో లారీలు షార్టేజ్ ఉండటం వలన బస్తాకు రెండు రూపాయల చొప్పున అదనంగా చెల్లిస్తేనే తూకం వేస్తామని చెప్పారు. ఇదేంటని అడిగినందుకు, తూకం వేసే సమయంలో వీడియో చిత్రీకరించందుకు లోడింగ్ నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీలేక వీడియో డిలీట్ చేస్తానని, బస్తాకు రెండు రూపాయలు అదనంగా చెల్లిస్తానని ఒప్పుకోవడంతో లోడింగ్ చేశారని వాపోయాడు. ఇప్పటికే అప్పులు పాలయ్యామని, ఇలా అయితే వ్యవసాయం చేయడం కష్టమని అన్నారు.