మామిడి పండ్ల కోసం వెళ్లి.. తలలు పగిలేలా కొట్టుకున్నరు

దిశ, పెద్దపల్లి : మామిడిపండ్లు కొనడానికి వెళ్ళిన వారిని మాస్క్‌లు ఎందుకు పెట్టుకోలేదని వ్యాపారులు ప్రశ్నించగా.. అమ్మేవారు మీరేందుకు పెట్టకోలేదు రివర్స్ ప్రశ్నించడంతో వివాదం ముదిరింది. దీంతో ఇరువర్గాలు తలలు పగల కొట్టుకున్నారు. ఈ ఘటనలో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి వద్ద ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. మామిడిపండ్లు కొనుగోలు చేసేందుకు తోటకు వెళ్ళిన ఒక పెళ్ళి బృందం మాస్క్‌లు ధరించక పోవడంతో తోటకు చెందిన ముదిరాజ్‌లు ప్రశ్నించారు. […]

Update: 2021-06-05 11:34 GMT

దిశ, పెద్దపల్లి : మామిడిపండ్లు కొనడానికి వెళ్ళిన వారిని మాస్క్‌లు ఎందుకు పెట్టుకోలేదని వ్యాపారులు ప్రశ్నించగా.. అమ్మేవారు మీరేందుకు పెట్టకోలేదు రివర్స్ ప్రశ్నించడంతో వివాదం ముదిరింది. దీంతో ఇరువర్గాలు తలలు పగల కొట్టుకున్నారు. ఈ ఘటనలో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి వద్ద ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. మామిడిపండ్లు కొనుగోలు చేసేందుకు తోటకు వెళ్ళిన ఒక పెళ్ళి బృందం మాస్క్‌లు ధరించక పోవడంతో తోటకు చెందిన ముదిరాజ్‌లు ప్రశ్నించారు.

అమ్మేవారు మీరేందుకు మాస్కులు పెట్టుకోలేదంటూ పెళ్ళి బృందం వారు తోట నిర్వాహకులను ఎదురు ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వివాదం చెలరేగి ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో కొందరి తలలు పగిలాయి. కాల్వశ్రీరాంపూర్, ఎదులాపూర్ గ్రామాలకు చెందిన పోలుదాసరి రాజయ్య, మేడి రాజేందర్, సాతిని ప్రవీణ్, పిట్టల మహేష్, కలవేన రమేశ్, కందుల మహేందర్, సురేష్, సంపంగి ప్రశాంత్‌ల‌తో పాటు మరికొందరు తీవ్రంగా గాయాపడ్డారు. సమాచారం అందుకున్న కాల్వశ్రీరాంపూర్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News