ఆహాతో కలిసి మంచు లక్ష్మి సరికొత్త షో

దిశ, సినిమా: ఓటీటీ ప్రపంచంలో ‘ఆహా’ సరికొత్త కంటెంట్‌తో ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ స్టార్స్‌ హోస్ట్‌గా సరికొత్త ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తోంది. ఈ క్రమంలో సమంత హోస్ట్‌గా వచ్చిన ‘సామ్ జామ్’ సూపర్ హిట్ కాగా.. రానా ‘నం.1 యారి’ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో మంచు లక్ష్మీ ప్రసన్నతో కలిసి మరో వెరైటీ ప్రోగ్రామ్‌తో రాబోతోంది తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్. ‘ఆహా భోజనంబు’ పేరుతో వస్తున్న షోలో స్టార్స్ ఫేవరేట్ ఫుడ్ ఐటెమ్స్‌ గురించి చర్చించడంతో […]

Update: 2021-07-10 08:17 GMT
Manchu Lakshmi
  • whatsapp icon

దిశ, సినిమా: ఓటీటీ ప్రపంచంలో ‘ఆహా’ సరికొత్త కంటెంట్‌తో ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ స్టార్స్‌ హోస్ట్‌గా సరికొత్త ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తోంది. ఈ క్రమంలో సమంత హోస్ట్‌గా వచ్చిన ‘సామ్ జామ్’ సూపర్ హిట్ కాగా.. రానా ‘నం.1 యారి’ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో మంచు లక్ష్మీ ప్రసన్నతో కలిసి మరో వెరైటీ ప్రోగ్రామ్‌తో రాబోతోంది తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్. ‘ఆహా భోజనంబు’ పేరుతో వస్తున్న షోలో స్టార్స్ ఫేవరేట్ ఫుడ్ ఐటెమ్స్‌ గురించి చర్చించడంతో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుంటారు. మంచు లక్ష్మీ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు మంచు విష్ణు, అఖిల్ అక్కినేని, తరుణ్ భాస్కర్, రానా, విశ్వక్ సేన్, ప్రకాశ్ రాజ్, ఆనంద్ దేవరకొండ గెస్ట్‌లుగా పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది.

Tags:    

Similar News