రియాకు మద్దతుగా మంచు లక్ష్మి..
మంచు లక్ష్మీ ప్రసన్న.. తండ్రి పోలికలను పుణికిపుచ్చుకున్న తనయ. తండ్రి మోహన్ బాబు లాగే తను కూడా తప్పు జరిగితే తప్పే అని చెప్పేస్తుంది. సమాజంలో ఒక ఘటన జరిగితే ముందుగా దానిపై అభిప్రాయం వ్యక్తం చేయడంలో ముందుంటుంది. ‘మేము సైతం’ అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలిచిన లక్ష్మి.. సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తికి అండగా నిలిచింది. @sardesairajdeep @Tweet2Rhea @itsSSR . Wake up my industry friends… […]
మంచు లక్ష్మీ ప్రసన్న.. తండ్రి పోలికలను పుణికిపుచ్చుకున్న తనయ. తండ్రి మోహన్ బాబు లాగే తను కూడా తప్పు జరిగితే తప్పే అని చెప్పేస్తుంది. సమాజంలో ఒక ఘటన జరిగితే ముందుగా దానిపై అభిప్రాయం వ్యక్తం చేయడంలో ముందుంటుంది. ‘మేము సైతం’ అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలిచిన లక్ష్మి.. సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తికి అండగా నిలిచింది.
@sardesairajdeep @Tweet2Rhea @itsSSR . Wake up my industry friends… stop this lynching. #letthetruthprevail pic.twitter.com/5SCEX8Un8H
— Lakshmi Manchu (@LakshmiManchu) August 30, 2020
రియా చక్రవర్తి, రాజ్ దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత సుశాంత్ కేసులో స్పందించిన లక్ష్మి.. అసలు దీని మీద స్పందించాలా లేదా అని చాలా ఆలోచించినట్లు తెలిపింది. రియా మీద మీడియా కాన్సంట్రేట్ చేయడం వల్ల చాలా మంది దీనిపై మాట్లాడేందుకు ముందుకు రావడం లేదని చెప్పింది. సుశాంత్ కేసు విషయంలో దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తు సంస్థలు ఇందులో నిజానిజాలు ఏంటో కచ్చితంగా బయటకు తీసుకొస్తాయి. కానీ అంతకుముందే రియా అండ్ ఫ్యామిలీని దోషుల్లా నిందించడం సరికాదని చెప్పింది. ఆ ఫ్యామిలీ ఎంత బాధ అనుభవిస్తుందో అర్థం చేసుకోగలనన్న లక్ష్మి.. ఇండస్ట్రీకి చెందిన వారు తనకు తోడుగా నిలవాలని పిలుపునిచ్చింది. నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే తోటివారు తోడుగా నిలబడాలని కోరుకుంటానని.. నేను ఇప్పుడు రియాకు మద్దతుగా నిలబడుతున్నానని తెలిపింది.