కరోనా గుర్తు తెచ్చిన గతం
దిశ వెబ్ డెస్క్: కరోనా వైరస్ మనుషులను భయబ్రాంతులకు గురిచేస్తున్న ప్రకృతి మేలు చేస్తోంది. కరోనా వల్ల గాలి, భూమి కాలుష్యం తగ్గింది. జంతువులు, పక్షులు స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. అయితే విచిత్రంగా ఓ మనిషికి కరోనా మేలు చేసింది. 30 ఏళ్ల క్రితం మరిచిపోయిన గతాన్ని కరోనా గుర్తు తెచ్చింది. ప్రకృతి తర్వాత కరోనా వైరస్ వల్ల మేలు జరిగిందంటే.. అది చైనాకు చెందిన ఝూ జియామింగ్ కు మాత్రమే. సుమారు 30 ఏళ్ల కిందట జియామింగ్ […]
దిశ వెబ్ డెస్క్: కరోనా వైరస్ మనుషులను భయబ్రాంతులకు గురిచేస్తున్న ప్రకృతి మేలు చేస్తోంది. కరోనా వల్ల గాలి, భూమి కాలుష్యం తగ్గింది. జంతువులు, పక్షులు స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. అయితే విచిత్రంగా ఓ మనిషికి కరోనా మేలు చేసింది. 30 ఏళ్ల క్రితం మరిచిపోయిన గతాన్ని కరోనా గుర్తు తెచ్చింది.
ప్రకృతి తర్వాత కరోనా వైరస్ వల్ల మేలు జరిగిందంటే.. అది చైనాకు చెందిన ఝూ జియామింగ్ కు మాత్రమే. సుమారు 30 ఏళ్ల కిందట జియామింగ్ తన గతాన్ని మరిచిపోయాడు. కరోనా వైరస్ వల్ల అతనికి మళ్లీ అంతా గుర్తుకు రావడం విశేషం. గుయ్జౌ ప్రాంతానికి చెందిన జియామింగ్ 1990లో హూబీలోని ఓ నిర్మాణ పనుల్లో కూలి పనుల కోసం వెళ్లాడు. అక్కడ పనిచేస్తుండగా జరిగిన ప్రమాదంలో తలకు పెద్ద దెబ్బ తగిలింది. తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చేరిన అతడు చనిపోతాడని అంతా భావించారు. వైద్యుల ప్రయత్నం వల్ల అతడి ప్రాణమైతే నిలిచింది. అమ్నేసియా వల్ల జ్ఞాపకశక్తి పోయింది. గతం మొత్తం మరిచిపోయాడు. అతని వెంట ఎవరూ లేరు. అతనికి గతం గుర్తు లేదు. దాంతో అతడు అదే ప్రాంతాల్లో ఉండిపోయాడు. వీధుల్లో తిరుగుతున్న అతడి బాధను అర్థం చేసుకుని ఓ జంట అక్కున చేర్చుకున్నారు. అతడి ఫొటోను పోలీసులకు ఇచ్చి.. కుటుంబికుల ఆచూకీ కనుగోమన్నారు. కానీ ఫలితం లేకపోయింది.
కరోనా వైరస్‌తో గుర్తొచ్చిన గతం..
మూడు నెలలుగా చైనాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. మూడు వేల మందికి పైగా కరోనా బారిన పడి చనిపోయారు. లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారు. అక్కడ మొదలైన వైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చెంది… అన్ని దేశాల పౌరులను కలవరపెడుతోంది. ఎన్నో వేలమందిని బలి తీసుకుంది. ప్రపంచ దేశాల్లో దాని ప్రభావమున్న చైనా ప్రజలు ఇప్పుడిప్పుడు దాని కోరల్లో నుంచి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా, టీవీ, పత్రికల ఇలా ఎక్కడ చూసినా.. కరోనా వార్తలే. కరోనా సమాచారమే. ఒక రోజు… జియామింగ్.. స్థానిక టీవీ చానెల్‌లో వార్తలు చూస్తుండగా అతడి సొంత ఊరైన గుయ్జౌను చూపించారు. దీంతో జియామింగ్‌కు తన ఊరు గుర్తొచ్చింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు గతం గుర్తుకొచ్చిందని తెలిపాడు. ఈ సందర్భంగా తన తండ్రి పేరు చెప్పి.. సమాచారం ఇవ్వాలని కోరాడు.
కర్ఫ్యూ ఆపింది:
జియామింగ్ ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు అతడి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నారు. జియామింగ్ బతికే ఉన్నాడనే సమాచారం ఇచ్చారు. కానీ, అతడి తండ్రి 18 ఏళ్ల కిందటే చనిపోయాడని తెలిపారు. 30 సంవత్సరాల తర్వాత తన సొంత వాళ్లను తెలుసుకున్నా జియామింగ్… పరుగుపరుగున ఇంటికి వెళ్లాలనుకున్నాడు. కానీ చైనాలో లాక్‌డౌన్ ఉండటం వల్ల .. ఎటూ వెళ్లలేకపోయాడు. ఇంటి సభ్యులను కలవలేకపోయినా.. వాల్ల అమ్మతో మాట్లాడాడు జియామింగ్.
పోలీసులు జియామింగ్ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబరు ఇచ్చారు. దీంతో జియామింగ్ వాళ్లకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఈ సందర్భంగా 83 ఏళ్ల తల్లి జియామింగ్‌తో మాట్లాడుతూ.. ‘‘నేను బతికుండగా నిన్ను చూడలేనేమో అనుకున్నా. నువ్వు ఇంకా జీవించి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపింది. జియామింగ్ మాట్లాడుతూ.. ‘‘ఎట్టకేలకు నా ఊరు, కుటుంబాన్ని తెలుసుకోగలిగాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపాడు.
Tags : corona , virus, china, zhu jieming, mother, amnesia, ghajini, 30 years, remind