భార్య మెడపై కత్తితో నరికిన భర్త
దిశ, వెబ్ డెస్క్: భార్యపై గొడవపడి కత్తితో నరికిన ఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం పెద్దరికుంట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పెద్ద ఉప్పరపల్లి అనెగారిపల్లికి చెందిన లక్ష్మీ(32) కి, పెద్దపంజాణి మండలం పెద్దరికుంట గ్రామానికి చెందిన ఈశ్వర్(37) కి… 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి మూడు సంవత్సరాలుగా లక్ష్మి వారి పుట్టింట్లోనే ఉంటోంది. వారం క్రితం అనెగారిపల్లికి వెళ్లిన ఈశ్వర్.. తన భార్యను […]
దిశ, వెబ్ డెస్క్: భార్యపై గొడవపడి కత్తితో నరికిన ఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం పెద్దరికుంట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పెద్ద ఉప్పరపల్లి అనెగారిపల్లికి చెందిన లక్ష్మీ(32) కి, పెద్దపంజాణి మండలం పెద్దరికుంట గ్రామానికి చెందిన ఈశ్వర్(37) కి… 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి మూడు సంవత్సరాలుగా లక్ష్మి వారి పుట్టింట్లోనే ఉంటోంది. వారం క్రితం అనెగారిపల్లికి వెళ్లిన ఈశ్వర్.. తన భార్యను పంపించాలని లక్ష్మీ తల్లిదండ్రులను కోరాడు.
దీంతో లక్ష్మీ, ఆమె తల్లిదండ్రులు, ఊరి పెద్దలు పెద్దరిగుంటకు వచ్చి ఈశ్వర్ తరపు వారితో మాట్లాడుతూ వుండగా… కోపోద్రిక్తుడైన ఈశ్వర్ మచ్చు కత్తితో భార్య మెడ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమెకు తీవ్ర రక్తస్రావం అయి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈశ్వర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.