బెంగాల్‌లో పోలింగ్ బూత్ బయట వ్యక్తి హత్య

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని పోలింగ్‌ బూత్ బయట ఓ వ్యక్తి హత్యకు గురికావడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై టీఎంసీ, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఘటనకు బీజేపీనే కారణమంటూ అధికార టీఎంసీ విమర్శలు చేస్తోంది. కాగా మృతుడు తమ పార్టీ ఏజెంట్ అనీ, పోలింగ్ బూత్‌కు వెళుతుండగా అతన్ని టీఎంసీ నేతలే హతమార్చారని బీజేపీ వాదిస్తోంది. కాగా మృతున్ని ఆనంద్ బర్మన్‌గా గుర్తించినట్టు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. కుచ్‌బీహార్ […]

Update: 2021-04-10 01:11 GMT

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని పోలింగ్‌ బూత్ బయట ఓ వ్యక్తి హత్యకు గురికావడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై టీఎంసీ, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఘటనకు బీజేపీనే కారణమంటూ అధికార టీఎంసీ విమర్శలు చేస్తోంది. కాగా మృతుడు తమ పార్టీ ఏజెంట్ అనీ, పోలింగ్ బూత్‌కు వెళుతుండగా అతన్ని టీఎంసీ నేతలే హతమార్చారని బీజేపీ వాదిస్తోంది.
కాగా మృతున్ని ఆనంద్ బర్మన్‌గా గుర్తించినట్టు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. కుచ్‌బీహార్ జిల్లాలోని సీతల్ కుంచి‌లోని పతాన్ తులీ పోలింగ్ బూత్ 85 వద్ద ఓటింగ్ జరుగుతున్న సమయంలో పోలీంగ్ బూత్ నుంచి అతన్ని బయటి తీసుకువచ్చి దుండగులు కాల్చిచంపినట్టు పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News