విజయవాడ గాంధీ సెంటర్‌లో దారుణ హత్య
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని పాతబస్తీ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇమ్రాన్ అనే వ్యక్తిని జాఫర్ అనే ఆటో డ్రైవర్ నడిరోడ్డుపై హతమార్చాడు. కాగా, ఇప్పటికే మృతుడు పలు డెకాయిట్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.