గూగుల్ మ్యాప్స్‌కే మతిపోగొట్టాడు!
రోడ్ల మీద నావిగేషన్ విషయానికొస్తే అందరికీ మొదట గుర్తొచ్చే యాప్ గూగుల్ మ్యాప్స్. ఈ యాప్‌నే గుడ్డిగా నమ్ముతూ ఓలా, ఊబర్ వంటి క్యాబ్ సర్వీసు సంస్థలు పొట్టనింపుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు ఏ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది? ఏ దారిలో వెళ్తే త్వరగా చేరుకుంటాం? అనే ప్రశ్నలకు గూగుల్ మ్యాప్స్ దగ్గర సమాధానం దొరుకుతుంది. కానీ అలాంటి గూగుల్ మ్యాప్స్‌కే ఓ వ్యక్తి మతిపోగొట్టి ట్రాఫిక్ లేని చోట విపరీతమైన ట్రాఫిక్ […]
రోడ్ల మీద నావిగేషన్ విషయానికొస్తే అందరికీ మొదట గుర్తొచ్చే యాప్ గూగుల్ మ్యాప్స్. ఈ యాప్‌నే గుడ్డిగా నమ్ముతూ ఓలా, ఊబర్ వంటి క్యాబ్ సర్వీసు సంస్థలు పొట్టనింపుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు ఏ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది? ఏ దారిలో వెళ్తే త్వరగా చేరుకుంటాం? అనే ప్రశ్నలకు గూగుల్ మ్యాప్స్ దగ్గర సమాధానం దొరుకుతుంది. కానీ అలాంటి గూగుల్ మ్యాప్స్‌కే ఓ వ్యక్తి మతిపోగొట్టి ట్రాఫిక్ లేని చోట విపరీతమైన ట్రాఫిక్ ఉన్నట్లు చూపించేలా చేశాడు.
సైమన వెకెర్ట్ అనే వ్యక్తి తాను గూగుల్ మ్యాప్‌ని ఫూల్ చేసిన వీడియోను యూట్యూబ్‌లో పంచుకున్నాడు. ఇందులో 99 స్మార్ట్‌ఫోన్ల సాయంతో అతను ఈ పని విజయవంతంగా చేయడాన్ని చూడొచ్చు. అన్ని ఫోన్లలోనూ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, వాటిని ఒక ట్రాలీలో వేసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంటే, ఆ ప్రాంతంలో బాగా ట్రాఫిక్ ఉంది వేరే మార్గం ఎంచుకోవాలని గూగుల్ మ్యాప్స్ చెబుతుంది. నిజానికి అక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఉండదు.
ఎలా సాధ్యమైంది?
గూగుల్ మ్యాప్స్ అల్గారిథమ్ వినియోగదారుడి రియల్‌టైమ్ ఇన్‌పుట్ ద్వారా పనిచేస్తుంది. అంటే అందరూ వినియోగదారుల నుండి వారి లొకేషన్ వివరాలు తెలుసుకుని, ఒకే చోటు నుంచి ఎక్కువ ఇన్‌పుట్స్ వస్తే ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నట్లుగా గుర్తించి ట్రాఫిక్ ఎక్కువ ఉందని గూగుల్ మ్యాప్స్ నిర్థరణకు వస్తుంది. అందుకే 99 స్మార్ట్‌ఫోన్ల నుంచి ఇన్‌పుట్ తీసుకున్న గూగుల్ మ్యాప్స్, సైమన్ గారడీకి తలదించుకోవాల్సి వచ్చింది. అయితే ఇది ఫన్నీ ట్రిక్ కాబట్టి సరిపోయింది, ఈ లోపాన్ని ఉపయోగించుకుని వేరే అగంతకులు రేపు ఏదైనా పెద్ద ప్రమాదం సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయని, వీలైనంత త్వరగా గూగుల్ మ్యాప్స్ ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.