వేటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలోని పేరూరు గ్రామ శివారులో నారాయణపేట జిల్లా ఓత్తులపల్లి గ్రామానికి చెందిన నిజాం పాషా (42) అనే వ్యక్తి విద్యుత్ షాక్ తో మరణించాడు. దేవరకద్ర ఎస్సై భగవంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… నిజాంపాషా అతని భార్యను చూడడానికి అత్తగారింటికి బాలకృష్ణాపురం వచ్చాడు. అతనితోపాటు బాలకిష్టా పూర్ గ్రామానికి చెందిన మరో ముగ్గురు వ్యక్తులు కలిసి పేరూరు గ్రామ శివారులో మూగజీవాలను వేటాడుతూ […]

Update: 2020-08-24 04:37 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలోని పేరూరు గ్రామ శివారులో నారాయణపేట జిల్లా ఓత్తులపల్లి గ్రామానికి చెందిన నిజాం పాషా (42) అనే వ్యక్తి విద్యుత్ షాక్ తో మరణించాడు. దేవరకద్ర ఎస్సై భగవంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… నిజాంపాషా అతని భార్యను చూడడానికి అత్తగారింటికి బాలకృష్ణాపురం వచ్చాడు. అతనితోపాటు బాలకిష్టా పూర్ గ్రామానికి చెందిన మరో ముగ్గురు వ్యక్తులు కలిసి పేరూరు గ్రామ శివారులో మూగజీవాలను వేటాడుతూ ఆదివారం రాత్రి అడవిలోకి వెళ్లారు. గ్రామానికి చెందిన ఓ రైతు తన పంట పొలాన్ని పందుల దాడి నుండి కాపాడుకోవడానికి కరెంట్ షాక్ పెట్టాడు.

ఈ విషయం తెలియని నిజం పాషా కుందేళ్ళను వేటాడుతున్న సమయంలో విద్యుత్ వైర్ కు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పొద్దున్నే పంట పొలానికి వెళ్లిన రైతుకు మృతి చెందిన నిజాంపాషను చూసి బిత్తరపోయి గ్రామస్థుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags:    

Similar News