ప్రాణం తీసిన చేపల వేట.. గోదావరిలో పడి వ్యక్తి మృతి

దిశ, కుక్కునూరు : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గోదావరిలో పడి మృతి చెందిన సంఘటన సోమవారం కుక్కునూరు మండలంలో చోటుచేసుకుంది. తెల్లరాయిగూడెం గ్రామానికి చెందిన సరియం పొట్టియ్య (60) అనే వృద్ధుడు ఆదివారం సమీపంలోని గోదావరికి చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహాయంతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం పొట్టియ్య మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కుక్కునూరు ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2021-07-26 10:57 GMT

దిశ, కుక్కునూరు : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గోదావరిలో పడి మృతి చెందిన సంఘటన సోమవారం కుక్కునూరు మండలంలో చోటుచేసుకుంది. తెల్లరాయిగూడెం గ్రామానికి చెందిన సరియం పొట్టియ్య (60) అనే వృద్ధుడు ఆదివారం సమీపంలోని గోదావరికి చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు.

కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహాయంతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం పొట్టియ్య మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కుక్కునూరు ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News